మెగా పవర్ స్టార్ రాంచరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ నిన్న రిలీజ్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా సరే రాంచరణ్ ఫ్యాన్స్ కి, అలాగే మాస్ ఆడియన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి వల్ల టాక్ తో సంబంధం లేకుండా నిన్న మంచి ఆక్యుపెన్సీలు వచ్చాయి. మొదటి రోజు ఫైనల్ గా రూ.89 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. షేర్ పరంగా రూ.50 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా మొదటి రోజు ఓకే.
ఇక రెండో రోజు సంగతేంటి? రెండో రోజు బుకింగ్స్ ఎలా ఉన్నాయి? రెండో రోజు ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు? ఈ ప్రశ్నలకి సమాధానం కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అందుతున్న ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక తమిళంలో కూడా బుకింగ్స్ డీసెంట్ గానే ఉన్నాయి.
అలాగే హిందీలో మొదటి రోజు కంటే కొంచెం బెటర్ గానే ఉన్నాయి. ఓవర్సీస్ లో పెద్దగా సత్తా చాటడం లేదు. కేరళలో కూడా డౌన్ అయిపోయింది. సో వరల్డ్ వైడ్ గా రెండో రోజు రూ.11 కోట్ల నుండి రూ.12 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఈ మార్క్ ను అందుకుంటే.. ఫెస్టివల్ హాలిడేస్ ను ఇంకా ఎక్కువగా క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.