Game Changer Collections: ‘గేమ్ ఛేంజర్’.. జస్ట్ ఓకే అనిపించింది!
- January 17, 2025 / 03:20 PM ISTByPhani Kumar
మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ,స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కలయికలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మొదటి వారం పూర్తయ్యింది. రూ.450 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఓపెనింగ్స్ జస్ట్ యావరేజ్ గా వచ్చాయి. సంక్రాంతి సెలవులు ఈ సినిమాకి కొంత హెల్ప్ అయినట్టు అయ్యింది. అందువల్ల డీసెంట్ షేర్స్ వచ్చాయి. వంద కోట్ల షేర్ మార్క్ కి దగ్గర పడింది.
Game Changer Collections

కానీ టార్గెట్ ఇంకా చాలా ఉంది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే:
| నైజాం | 18.38 cr |
| సీడెడ్ | 9.92 cr |
| ఉత్తరాంధ్ర | 9.29 cr |
| ఈస్ట్ | 5.60 cr |
| వెస్ట్ | 3.76 cr |
| కృష్ణా | 4.94 cr |
| గుంటూరు | 5.83 cr |
| నెల్లూరు | 3.43 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 61.17 cr |
| కర్ణాటక | 4.75 cr |
| తమిళనాడు | 3.26 cr |
| కేరళ | 0.26 cr |
| ఓవర్సీస్ | 13.65 cr |
| నార్త్ | 13.62 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 96.71 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. మొదటి వారం ఈ సినిమాకు రూ.96.71 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.158.29 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.















