అడవి దొంగ సినిమా చూస్తూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న 60 ఏళ్ల మహిళ?

సాధారణంగా కొన్ని రకాల సర్జరీలో నిర్వహిస్తున్న సమయంలో ఏ విధమైనటువంటి అనస్తీసియా ఇవ్వకుండా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మెదడుకు సంబంధించిన సర్జరీలను చేసేటప్పుడు వైద్యులు పేషెంట్లకు మత్తు ఇవ్వకుండా వారిని మాటలలో పెడుతూ వారికి సర్జరీ చేయడం మనం చూస్తుంటాము.ఈ క్రమంలోనే గాంధీ ఆసుపత్రిలో వైద్యులు 60 సంవత్సరాల మహిళకు ఏ విధమైనటువంటి మత్తు లేకుండా బ్రెయిన్ సర్జరీ చేశారు. ఇకపోతే ఈమె మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని కావడంతో ఈమె ఈ సర్జరీ చేస్తున్న సమయంలో చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా చూస్తూ సర్జరీ చేయించుకున్నారు.

మధ్య మధ్యలో డాక్టర్లు సైతం ఆమెతో మాటలు కలుపుతూ సర్జరీ చేస్తున్నామనే భావన లేకుండా ఎంతో సునాయాసంగా సర్జరీ నిర్వహించి తన మెదడులో ఉన్నటువంటి కనుతులను తొలగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా తన అభిమాన నటుడు చిరంజీవి అని తను నటించిన సినిమాలన్నింటినీ తాను చూస్తూ ఉంటానని ఈ సందర్భంగా మహిళ అభిమాని తెలియజేయడంతో ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గాంధీ ఆసుపత్రికి తన పిఆర్ఓ ఆనంద్ ను పంపించి అక్కడ వైద్య సిబ్బందిని సంప్రదించమని చెప్పారు.

ఈ క్రమంలోనే ఆనంద హాస్పిటల్ కి వెళ్లి వైద్యులను కలిసి అనంతరం మెగాస్టార్ అభిమానిని పరామర్శించారు. ఈ క్రమంలోనే ఆమె తను చిరంజీవికి పెద్ద అభిమానిని ఇప్పటికి చిరంజీవి సినిమాలన్నింటినీ చూస్తూ ఉంటానని చెప్పారు. ఇదే విషయాన్ని ఆనంద్ మెగాస్టార్ చిరంజీవికి చెప్పడంతో

ఆయన వీలు చూసుకుని మరో రెండు మూడు రోజులలో తాను తన మహిళ అభిమానిని చూడటం కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్తానని తెలిపారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని అక్కడ వైద్య సిబ్బందితో అలాగే మహిళా అభిమానికి తెలియజేయడంతో ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus