హైద్రాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గరికపాటి మెగాస్టార్ చిరంజీవి పట్ల అసహనం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా మెగా అభిమానులు మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి ఫోటో సెషన్ ఆపితే తన ప్రసంగం మొదలు పెడతాను అంటూ ఈయన తనని అవమానించారు. ఈ విధంగా గరికపాటి చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ వివాదాస్పద ట్వీట్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఈ విధంగా నాగబాబు ట్వీట్ చేయడంతో బ్రాహ్మణ సంఘం పరోక్షంగా నాగబాబుకు కౌంటర్ వేశారు. ఇలా ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఈ వివాదం పై గరికపాటి స్పందించారు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి యువత అధ్యక్షుడు భవాని కుమార్ శుక్రవారం గరికపాటిక స్వయంగా ఫోన్ చేసి ఈ విషయంపై ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా భవాని కుమార్ మాట్లాడుతూ..అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి పట్ల మీరు వ్యవహరించిన తీరు తమని ఎంతగానో బాధ పెట్టిందని ఈయన మాట్లాడారు.
మీలాంటి గొప్ప వ్యక్తి నుంచి ఇలాంటి కామెంట్స్ ఊహించలేదని భవాని కుమార్ మాట్లాడటంతో ఇందుకు గరికపాటి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై గరికపాటి స్పందిస్తూ చిరంజీవి ఎంతో సహృదయుడు అని మాట్లాడటమే కాకుండా ఈ విషయంపై తాను స్వయంగా ఫోన్ చేసి చిరంజీవి గారితో మాట్లాడతానని గరికపాటి భవాని కుమార్ కి మాటిచ్చారు. అయితే గరికపాటి మెగాస్టార్ చిరంజీవి అవమానకరంగా మాట్లాడటంతో అభిమానులు తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.