నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా కోసం అభిమానులు వెయ్యికన్నులతో ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాలయ్య వందో చిత్రం టీజర్, ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్ లో అధిక వ్యూస్ అందుకుంటోంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం వీఎఫెక్స్ హంగులు అద్దుకుంటోంది ఈ పనుల్లో నిపుణులు బిజీగా ఉన్నప్పటికీ డైరక్టర్ ఈ సినిమా(గ్రాఫిక్స్, వీఎఫెక్స్ జోడించని)ని తన స్నేహితులు, డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించారని తెలిసింది. వారి నుంచి ఫిల్మీ ఫోకస్ సేకరించిన సంగతులతో గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ రివ్యూ…
భారత భూభాగాన్ని 400 ఏళ్లు పాలించిన శాతవాహనుల రాజుల్లో గొప్పవాడిన గౌతమి పుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. భరత ఖండం పై యుద్ధాలు జరగకూడదని, శాంతి ప్రజ్వలిల్లాలని సంకల్పించిన తెలుగు చక్రవర్తి లక్ష్యాన్ని చేరుకునే వైనాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. ఒకటవ శతాబ్దానికి మనల్ని క్రిష్ ఈ చిత్రం ద్వారా తీసుకెళ్లారు. గౌతమి పుత్ర శాతకర్ణిగా బాలకృష్ణ రాజసం అమోఘం. యుద్ధ విన్యాసాలు అద్భుతం. ఆయన నోటి నుంచి వచ్చే డైలాగులు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. చిరంతన్ భట్ సాంప్రదాయ వాయిద్యాలతో సమకూర్చిన పాటలు వినేందుకు యావరేజ్ ఉన్నప్పటికీ తెరపైన కనులవిందుగా ఉంది. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ కథను చెప్పే విధానం ఆకట్టుకుంది.
శాతకర్ణి తల్లిగా బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొన్ని సన్నివేశాల్లో శాతకర్ణి భార్య వశిష్టా దేవిగా శ్రీయా శరన్ పలికిన అభినయం కన్నీరు తెప్పిస్తుంది. ఈ పాత్ర ఆమెకు నటిగా మంచి పేరు తీసుకొస్తుంది. “తక్కువ సమయంలో ఇంతటి గొప్ప చిత్రాన్ని ఎలా తీయగలిగారు” .. ఈ చిత్రాన్ని చూసిన వారి వెంట వస్తున్న తొలి మాట ఇది. విజువల్ ఎఫెక్ట్స్, రీరికార్డింగ్ పూర్తికాకముందే మెస్మరైజ్ చేస్తుంటే థియేటర్లో ఇంకెంతగా ఆకట్టుకోనుందోనని ఆశ్చర్యపోతున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ మూవీ అవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ మూవీ రేపు సెన్సార్ వద్దకు వెళ్లి .. సరిగ్గా వారం తర్వాత అంటే జనవరి 12 రిలీజ్ అయి రికార్డులను చరిత్ర పుటల్లోకి ఎక్కించనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.