Geetu Royal: ఈవారం గీతు రాయల్ వరెస్ట్ పెర్ఫామర్ ఎందుకయ్యిందంటే.,

బిగ్ బాస్ హౌస్ లో వారం వారం లెక్కలు మారిపోతుంటాయి. ఫస్ట్ లో ఉన్నంత ఉత్సాహం వారాలు గడిచే కొద్ది హౌస్ మేట్స్ లో కనిపించదు. అందుకే, ఫస్ట్ రెండు వారాలు హౌస్ లో తమ ఉనికి చాటుకునేందుకు చూస్తుంటారు హౌస్ మేట్స్. ఇందులో భాగంగానే సోషల్ మీడియా యూట్యాబ్ స్టార్ గా వచ్చిన గీతురాయల్ ఫస్ట్ వీక్ రెచ్చిపోయింది. తను ఎలాంటిందో హౌస్ మేట్స్ కి, ఆడియన్స్ కి తెలిసేలా గేమ్ ఆడింది.

చిత్తూరు – నెల్లూరు గలబోసిన యాసతో టిపికల్ బాడీ లాంగ్వేజ్ తో హౌస్ లో రెచ్చిపోతోంది. ఇప్పటికే హౌస్ మేట్స్ కి, చూసే ప్రేక్షకులకి బాగా ఇరిటేషన్ తెప్పిస్తోంది గీతు రాయల్. ప్రతి రోజూ ఏదో ఒక ఇష్యూతో హైలెట్ అవుతూనే వస్తోంది. దీంతో గీతూని హౌస్ లో నుంచీ పంపించేయడం అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఈవారం వరెస్ట్ పెర్ఫామర్ ని ఎంచుకోమని హౌస్ మేట్స్ కి చెప్పాడు.

దీంతో హౌస్ లో దాదాపుగా 12 ఓట్లు వరకూ గీతురాయల్ కి పడ్డాయి. నోరు అదుపులో పెట్టుకోమని కొందరు చెప్తే, అనవసరమైన విషయాల్లో దూరుతున్నావ్ అని, టాస్క్ లో స్ట్రాటజీ నచ్చలేదని, నేనింతే నాఇష్టం అని ఉంటే నడవదు అని ఇలా రకరకాల రీజన్స్ చెప్పి వరెస్ట్ బిహేవియర్ అని హౌస్ మేట్స్ తేల్చేశారు. దీంతో గీతు రాయల్ కి జైల్ కి వెళ్లక తప్పలేదు.

ఇక గీతు జైలుకి వెళ్లి కూడా నాకంటే లూజ్ గా మాట్లాడిన వాళ్లు ఉన్నారని, రేవంత్, ఇనయ కూడా ఎక్కువే మాట్లాడారని ఫైమాకి చెప్పింది. ముఖ్యంగా రేవంత్ కి గీతుకి అస్సలు పడట్లేదు. ఫస్ట్ నుంచీ కూడా రేవంత్ బిహేవియర్ ఇలాగే ఉంటే బయటకి వెళ్లిపోతాడని అంటూనే ఉంది గీతు. మరి గీతు ఆటతీరుకి కింగ్ నాగార్జున వీకెండ్ ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరం. అదీ మేటర్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus