Geetu, Revanth: గీతు విషయంలో రేవంత్ కావాలనే అలా చేేశాడా ? ఏం జరిగిందంటే.?

  • September 15, 2022 / 10:47 AM IST

బిగ్ బాస్ హౌస్ లో సిసింద్రీ టాస్క్ లో గలాటే గీతు గేమ్ ఛేంజర్ అవుదామని అనుకుంది. తనకి ఇచ్చిన బేబీ డాల్ ని తెలివిగా స్టోర్ రూమ్ లో పెట్టి ఆ విషయాన్ని బిగ్ బాస్ కి చెప్పింది. అంతేకాదు, స్టర్ రూమ్ లో ఫ్రిజ్ వెనకాల పెట్టిన బొమ్మకి బట్టలు , పేరు తీసేసింది. ఒకవేళ బిగ్ బాస్ తీసేసుకున్నా పర్లేదని అనుకుంది గీతు. కానీ, బిగ్ బాస్ ఆ పని చేయలేదు. స్టోర్ రూమ్ లో వచ్చిన వస్తువులు తీసుకున్న రేవంత్ అనుమానం వచ్చి రూమ్ అంతా వెతికాడు.

ఫ్రిజ్ వెనకాల ఉన్న బొమ్మని చూశాడు. కానీ ఆ బొమ్మ ఎవ రిదో దానిపైన పేరు లేదు. హౌస్ మేట్స్ అందరూ ముక్కకంఠంతో అది గీతు బొమ్మే అని చెప్పారు. దీంతో గీతు చూడకుండా వెళ్లి రేవంత్ ఆ బొమ్మని లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో వేసేశాడు.అప్పటివరకూ వాష్ రూమ్ లో ఉన్న గీతు బొమ్మని తీసుకున్నారని గ్రహించింది. ఆదిరెడ్డి రేవంత్ నీ బొమ్మని లాస్ట్ ఏరియాలో వేశాడని చెప్పాడు. అయినా కూడా చాలా లైట్ తీస్కుంది.

అంతేకాదు, ఆదిత్య బొమ్మకి తన డ్రెస్ వేసుకుని అది నా బొమ్మకాదు అంటూ దబాయించింది. ఆ తర్వాత ఆదిత్యతో ఉన్న ర్యాపో వల్ల ఆదిత్యకి బొమ్మని ఇచ్చేసింది. ఇక్కడే హౌస్ మేట్స్ కి టాస్క్ లో చాలా డౌట్స్ వచ్చాయి. బొమ్మకి పేరు మారిస్తే వేరేవాళ్ల బొమ్మ అయిపోతుందా అంటూ ఆదిత్య సందేహాన్ని వ్యక్తం చేశాడు. గీతు విషయంలో రేవంత్ కావాలనే బొమ్మని పారేశాడా.. లేదా ఆ బొమ్మ ఎవరిదో తెలిసిన తర్వాత చేశాడా అనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి ఆ బొమ్మ ఎవరిదో తెలియక ముందు దాన్ని బెడ్ రూమ్ లో దాచేద్దామని అనుకున్నాడు. కానీ, హౌస్ మేట్స్ గీతు దే అని కన్ఫార్మ్ చేస్తూ చెప్పాక లాస్ట్ ఏరియాలో వేసేశాడు. నిజానికి అది ఆదిత్య బొమ్మ అయి ఉంటే మాత్రం వేసేవాడా ? కాదా ? కేవలం గీతు బొమ్మ అని చెప్పి వెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో వేసి గీతుని గేమ్ నుంచీ అవుట్ చేశాడా అనేది వీకండ్ నాగార్జున చెప్పిస్తేనే కానీ తెలియదు. అదీ విషయం.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus