మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో స్టార్ డంని సంపాదించుకున్న దర్శకుడు. త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే మోరల్స్ తో అలాగే ప్రాసలతో కూడుకున్న పంచ్ డైలాగులు మనల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. చాలా మందిలో త్రివిక్రమ్ డైలాగుల ప్రభావం ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక అసలు విషయంలోకి వెళితే.. త్రివిక్రమ్ మొదట్లో 2,3 ఏళ్లకు ఒక సినిమా అన్నట్టు చేసేవారు.
2002 లో ఆయన మొదటి చిత్రం ‘నువ్వే నువ్వే’ వచ్చింది. ఆ తర్వాత ‘అతడు’ 2005 లో విడుదలైంది. ఇక ‘జల్సా’ 2008 లో రిలీజ్ అయ్యింది. అలాగే మహేష్ తో చేసిన రెండో సినిమా ‘ఖలేజా’ 2010 లో వచ్చింది. ఒక సినిమాకి.. ఇంకో సినిమాకి గ్యాప్ అనేది ప్రతి దర్శకుడికి కామన్ గా జరిగేదే. కానీ మొదట్లో మేకింగ్ కోసం కూడా త్రివిక్రమ్ ఎక్కువ టైం తీసుకునేవారు. కానీ ‘జులాయి’ నుండి ఆయన పంధా మార్చారు.
ప్రాజెక్టు అనౌన్స్ చేయడమే ఆలస్యం 6 నెలల నుండి 9 నెలల్లో సినిమాని కంప్లీట్ చేసి విడుదల చేయడం అలవాటు చేసుకున్నారు త్రివిక్రమ్. స్టార్ హీరోల అభిమానులను ఎక్కువగా వెయిట్ చేయించకూడదు అని పలు సందర్భాల్లో త్రివిక్రమే చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన వైఖరి చూస్తుంటే మళ్ళీ మొదటికెళ్లినట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే.. మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది.
2021 సమ్మర్ లో ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేస్తే ఇప్పటి వరకు ఒక్క షెడ్యూల్ కూడా సరిగ్గా కంప్లీట్ కాలేదు. మహేష్ – త్రివిక్రమ్ లు ఈ ప్రాజెక్టు విషయంలో చాలా లేజీగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. మహేష్ కూడా తాను నిర్మాణ భాగస్వామిగా ఉంటే వెంటనే ప్రాజెక్టు ఫినిష్ చేయాలని చూస్తాడు. కానీ త్రివిక్రమ్ ప్రాజెక్టు విషయంలో పూర్తిగా హారిక అండ్ హాసిని వారు నిర్మాతలుగా వ్యవహరిస్తుండడంతో అతను కూడా ఈ ప్రాజెక్టు ఫాస్ట్ గా ఫినిష్ చేసే ఆలోచనలో లేనట్లు తెలుస్తుంది.
అయితే మహేష్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు.. ఇక్కడ సినిమాని లేట్ చేయడం వల్ల త్రివిక్రమ్ కే ఇబ్బంది. 2012 నుండి త్రివిక్రమ్ ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేస్తాడు అని సంపాదించుకున్న ఇమేజ్ ను మళ్ళీ మహేష్ సినిమాతో పోగొట్టుకున్నట్టు అవుతుంది.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!