Ghani Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘గని’ ..!

వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో ‘రెనైజెన్స్ పిక్చర్స్’ ‘అల్లు బాబీ కంపెనీ’ బ్యానర్లపై సిద్దు ముద్ద, అల్లు బాబీ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పాలి.వరుణ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడి 6 ప్యాక్ బాడీని డెవలప్ చేసాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది.

తమన్ సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ అంచనాలను మూవీ అందుకోవడంలో విఫలమయ్యింది. దాంతో బాక్సాఫీస్ వద్ద ‘గని’ కి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ కాలేదు. 4 వ రోజున అంటే మొదటి సోమవారం రోజున కూడా ఈ మూవీ కలెక్షన్లు మరింతగా పడిపోయాయి.

ఒకసారి 4డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.43 cr
సీడెడ్ 0.43 cr
ఉత్తరాంధ్ర 0.61 cr
ఈస్ట్ 0.34 cr
వెస్ట్ 0.23 cr
గుంటూరు 0.31 cr
కృష్ణా 0.27 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.25 cr
ఓవర్సీస్ 0.34 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.40 cr

‘గని’ చిత్రానికి రూ.25.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.27 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు బ్యాడ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో ఈ మూవీ కలెక్ట్ చేయలేకపోతుంది. వీకెండ్ తర్వాత పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. మరో పక్క ‘ఆర్.ఆర్.ఆర్’ పోటీ కూడా ఉండడంతో ‘గని’ డిజాస్టర్ కలెక్షన్లకి కారణం అని చెప్పాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ‘గని’ రూ.4.4 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.22.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus