మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా రిలీజ్ కి ముందు ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ చేయలేదు. మెగాస్టార్ సినిమా రేంజ్ లో హడావిడి కూడా కనిపించలేదు. కానీ రిలీజ్ తరువాత మాత్రం సినిమా హిట్ టాక్ తో దూసుకుపోయింది. మొదటి ఐదు రోజులు సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. కానీ సోమవారం పరీక్షలో మాత్రం పాస్ అవ్వలేకపోయింది. నిన్నటినుంచి చాలా సెంటర్స్ లో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాన నగరాలు, పట్టణాలు మినహాయించి మిగిలిన చోట్ల హాళ్లు సగమే నిండాయనేది ఎగ్జిబిటర్ల రిపోర్ట్. సాధారణంగా ఏ సినిమాకైనా ఇది సహజంగా జరిగేదే. ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సూపర్ హిట్ సినిమాలు మాత్రం వీక్ డేస్ లో కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా ఉంటాయి. ‘గాడ్ ఫాదర్’ సినిమా మాత్రం వీక్ డే నిలబడలేకపోతుంది. సినిమాకి నెగెటివ్ టాక్ రానప్పటికీ.. కలెక్షన్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తోంది. ఇప్పటివరకు సినిమా రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టడమంటే చిన్న విషయం కాదు.
థియేట్రికల్ బిజినెస్ తక్కువగా జరిగి ఉంటే ఈ మొత్తం ఎక్కువని చెప్పుకోవచ్చు. కానీ రూ.91 కోట్లకు బ్రేక్ ఈవెన్ పెట్టుకోవడంతో టార్గెట్ ఎక్కువైపోయింది. మరో నలభై కోట్లు రాబట్టడమంటే అంత ఈజీ కాదు. రాబోయే పది రోజులు ‘గాడ్ ఫాదర్’ సినిమాకి చాలా కీలకం కానున్నాయి. ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు.
దీపావళికి మాత్రం కాస్త హడావిడి ఉంటుంది. ‘జిన్నా’, ‘సర్దార్’, ‘ఓరి దేవుడా’, ‘ప్రిన్స్’, ‘బ్లాక్ ఆడమ్’ వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలానే అక్టోబర్ 15నకన్నడ సినిమా ‘కాంతార’ను రిలీజ్ చేయనున్నారు. ఇది కన్నడలో సెన్సేషన్ సినిమాగా నిలిచింది. తెలుగులో కూడా క్లిక్ అయితే ‘గాడ్ ఫాదర్’కి పెద్ద దెబ్బే. మరేం జరుగుతుందో చూడాలి!
Most Recommended Video
నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!