Naatu Naatu Song: ‘ఆర్ఆర్ఆర్’ లిస్ట్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు!

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వేదికపై హవా చూపిస్తోంది. ఇంటర్నేషనల్ రేంజ్ లో అవార్డ్స్ సాధిస్తోంది ఈ సినిమా. ఇప్పుడేమో ఏకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. 80వ గోల్డెన్ గ్లోబ్స్ ఈవెంట్ లో ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చినట్లు ప్రకటించగానే.. ఒక్కసారిగా హాల్ మొత్తం కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. అక్కడే ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సంబరపడిపోయింది.

‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ఘనతను కొనియాడుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కి కంగ్రాట్స్ చెబుతూ పోస్ట్ లు చెబుతున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ను ఉద్దేశిస్తూ.. ట్వీట్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా.. ప్రత్యేకమే అని.. ఆయన సినిమాల్లో, మాటల్లో, చేతల్లో మన సంప్రదాయం కనిపిస్తుంది, వినిపిస్తోందని అన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా ఆయన మార్క్ చూపించారని..

దీన్ని రాజమౌళితో పాటు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సాధించిన ఘనతగా చూడాలని అన్నారు. సుమారు ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు బెస్ట్ నాన్ – ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ సైతం నామినేషన్ దక్కించుకున్నారు.

ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి సతీసమేతంగా హాజరయ్యారు. వీరితో పాటు ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా ఈవెంట్ కి వెళ్లారు. దర్శకుడు రాజమౌళి ఇండియన్ ట్రెడిషన్ కి తగ్గట్లుగా డ్రెస్ చేసుకున్నారు. రాజమౌళి భార్య, కీరవాణి భార్య, రామ్ చరణ్ భార్య ఉపాసనలు చీరకట్టులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus