‘పుష్ప’ సినిమాలో హీరోకి అన్నీ కలిసొచ్చేస్తుంటాయ్… చిన్న కార్మికుడిగా జీవితం ప్రారంభించి… ఏకంగా ఎర్రచందనం అడ్డాకు హెడ్‌గా మారిపోతుంటాడు. అయితే ఈ ఫీట్ సాధించడానికి చాలా కష్టపడతాడు అనుకోండి. కానీ నిజ జీవితంలో సినిమాకు కలిసొచ్చే అంశాలు వరుసగా వస్తున్నాయి. అవును… సంక్రాంతి సినిమాల పరిస్థితిని ఓ కుదుపు కుదిపేసిన కరోనా…. ‘పుష్ప’కు మాత్రం బాగా కలిసొచ్చింది. దీంతో ముందుగా వస్తాయనుకున్న వసూళ్లు కంటే… ఇప్పుడు ఎక్కువ వస్తాయని చిత్రబృందం భావిస్తోంది.
నిజానికి జనవరి 6 వరకు టాలీవుడ్‌లో ‘పుష్ప’ దండయాత్ర ఉండాలి. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ వాయిదా పడటంతో ఆ జోరు జనవరి 14 వరకు కొనసాగుతుందని తేలిపోయింది. అయితే ఇప్పుడవు ‘రాధేశ్యామ్’ కూడా అనుకున్న సమయానికి రాదు అని వార్తలొస్తున్న నేపథ్యంలో… ‘పుష్ప’ సినిమాకు ఇక అడ్డే లేదు అనేది కొత్త టాక్. అదేంటి… సంక్రాంతికి ఆ సినిమాలు రాకపోతేనేం… ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి కదా అంటారా? ఆ సినిమాల సత్తా ఏంటి అనే విషయంలో ఇంకా క్లారిటీ రానప్పటికీ… పెద్ద హీరోల సినిమాలు కావు అనేది సుస్పష్టం.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎక్కువ శాతం ఎవరి చేతుల్లో ఉన్నాయనేది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో వాళ్ల సినిమాను కాదని, ఓ చిన్న సినిమాను వేసే పరిస్థితి ఉండదు. మరోవైపు ‘పుష్ప’ను కొన్ని చోట్ల రీ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని వినిపిస్తోంది. అదే జరిగితే ‘పుష్ప’ సినిమాకు మరో పెద్ద సినిమా వచ్చేంతవరకు అవకాశం ఉన్నట్లే అనుకోవచ్చు. అయితే ఓటీటీలో సినిమా ఎప్పుడు అనేది కూడా ఇక్కడ కీలకాంశం.
‘పుష్ప’ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 7న టెలీకాస్ట్ చేస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు పెద్ద సినిమాలు థియేటర్‌లో లేని నేపథ్యంలో ఆ డేట్‌ను మారుస్తారేమో చూడాలి. ఒకవేళ ఇదే జరిగితే… ‘క్రాక్’ తర్వాత ఇలా థియేటర్ల కోసం రిలీజ్ డేట్ మారిన సినిమా ఇదే అవుతుంది. మరి ‘పుష్ప’ టీమ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!