దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. ‘క్రాక్’ (Krack) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘జాట్’ (Jaat) వంటి సినిమాలతో అతని రేంజ్ పెరిగింది. అయితే ఓ దశలో ‘విన్నర్’ (Winner) అనే సినిమాతో ఇతని పని అయిపోయింది అని కూడా అంతా అనుకున్నారు. మలినేని కెరీర్లో డిజాస్టర్ అంటే ఈ ఒక్క సినిమానే. అయితే వెంకటేష్ (Venkatesh) తో చేసిన ‘బాడీ గార్డ్’ (Bodyguard) విషయంలో కూడా ఇతను సంతృప్తిగా లేనట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ… ” ‘డాన్ శీను’ (Don Seenu) కమర్షియల్ సక్సెస్ అందుకున్న తర్వాత నాగ చైతన్య గారి కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. కానీ ఆ టైంలో ఎక్కువ మెచ్యూరిటీ లేదు. అలాంటి టైంలో కోన వెంకట్ వచ్చి ‘ఏ గోపి వెంకటేష్ బాబుతో ‘బాడీ గార్డ్’ రీమేక్ చేయి… బాగుంటుంది’ అన్నారు. అది ఒరిజినల్ కథ మలయాళం అనే సంగతి అందరికీ తెలుసు. అక్కడ అది సాఫ్ట్ స్టోరీ. తర్వాత తమిళ్, హిందీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా హిట్ అయ్యాయి.
సో బాగుంటుంది అనుకుని పెద్దగా ఆలోచించలేదు. తెలుగులో మేము లవ్ స్టోరీతో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ చేశాం. అయితే ఆ సినిమా తర్వాత భవిష్యత్తులో నేను రీమేక్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. అలాగే ‘విన్నర్’ చేశాక ఇంకొకరి కథలతో సినిమాలు చేయకూడదు. మన కథలతోనే సినిమా చేసుకుంటూ పోవాలి అనే రెండు గొప్ప పాఠాలు నేర్చుకున్నాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘బాడీ గార్డ్’ బాగానే ఆడినప్పటికీ మిగిలిన భాషల్లో హిట్ అయినట్టు తెలుగులో హిట్ అవ్వలేదు. ఇక ‘విన్నర్’ అయితే పెద్ద డిజాస్టర్ అయ్యింది. వెలిగొండ శ్రీనివాస్ (Veligonda Srinivas) అందించిన కథతో ఈ సినిమా తీశారు. ఆ కథని సరిగ్గా ఓన్ చేసుకోలేక బలవంతంగా గోపీచంద్ చేసి ఉండొచ్చు అని అతని కామెంట్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.