Balakrishna: ‘అఖండ’ ఎఫెక్ట్.. గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ లో మార్పులు!

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తరువాత బాలయ్య ఇమేజ్ పెరిగిందనే చెప్పాలి. దీంతో ఆయన తదుపరి సినిమాలపై దర్శకనిర్మాతల ఫోకస్ ఎక్కువైంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. రాయలసీమ ఫ్యాక్షన్, మైనింగ్ లాంటి అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఈ సినిమాలో మాస్ ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని టాక్. దీనికి తోడు రెండు సీన్లు యాడ్ చేయబోతున్నారని టాక్. అవేంటంటే.. హిందూ ధర్మాన్ని ఎలివేట్ చేసేలా ఉంటాయట. బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా చాలా వరకు డివోషనల్ గా సాగుతుంది. నిజానికి బాలయ్య సినిమాలో డివోషనల్ టచ్ ఉండేలా చూసుకుంటారు. ‘అఖండ’లో కాస్త ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో కూడా డివోషనల్ టచ్ తో ఒకట్రెండు సన్నివేశాలు చేర్చడానికి ప్రయత్నించమని బాలయ్య దర్శకుడిని కోరినట్లు తెలుస్తోంది.

దీంతో ఉన్న సన్నివేశాల్లోనే అడ్ఙస్ట్ మెంట్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే రచయిత సాయిమాధవ్ బుర్రా కాస్త పొలిటికల్ టచ్ ఉండేలా డైలాగ్స్ రాస్తున్నారట. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అలానే చంద్రిక రవి అనే నటి ఐటెం సాంగ్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఐటెం సాంగ్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus