Gopichand: మరో నూతన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్.. కానీ..!

యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand)  సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. 2014 లో వచ్చిన ‘లౌక్యం’ (Loukyam) తో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్.. ఆ తర్వాత దాని స్థాయిలో హిట్టు అందుకోలేదు. ‘జిల్’ (JIl)  ‘సీటీమార్’ (Seetimaarr) ‘భీమా’ (Bhimaa) ‘విశ్వం’ (Viswam)  వంటి సినిమాలు పర్వాలేదు అనిపించాయి కానీ.. క్లీన్ హిట్స్ అయితే కాదు. మాస్ ఆడియన్స్ లో గోపీచంద్ సినిమాలకి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. కానీ మార్కెట్ పరంగా వెనుకబడ్డాడు. విశ్వక్ సేన్(Vishwak Sen) , కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వంటి హీరోలు కూడా మార్కెట్ పెంచుకుంటూ పోతున్నారు.

Gopichand

కానీ గోపీచంద్ మాత్రం వాళ్ళ కంటే వెనుకే ఉండటం గమనార్హం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే.. గోపీచంద్ కి సరైన డైరెక్టర్ పడటం లేదు. గోపీచంద్ కి మాస్ సినిమాలు బాగా యాప్ట్ అవుతాయి. కానీ వాటిని, గోపి ఇమేజ్ ని దర్శకులు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ ‘ఘాజి’ (Ghazi)  దర్శకుడు సంకల్ప్ రెడ్డితో  (Sankalp Reddy) ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇది కూడా సంకల్ప్ స్టైల్లోనే ఉంటుందని తెలుస్తుంది.

ఇలాంటి దర్శకుడు గోపీచంద్ కి తగిన సినిమా ఇస్తాడా? అంటే దానికి ఆన్సర్ ప్రస్తుతానికి లేదు. మరోపక్క కుమార్ అనే రైటర్ కి గోపీచంద్ ఛాన్స్ ఇచ్చాడట. అతని డైరెక్షన్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో గోపీచంద్ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇది కూడా రూ.60 కోట్ల బడ్జెట్ సినిమా అని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus