ప్రపంచం లో చార్లీ చాప్లిన్ పేరు తెలియనివాళ్ళు ఉండరు.ప్రపంచానికి, సినిమాలకి, స్క్రిప్ట్ లకి, టి. వి. లకు హాస్యాన్ని పరిచయం చేసిన ఘనుడు.తన నటనతో, మాటలు లేకుండానే కడుపుబ్బా నవ్వించే నటుడు కూడా ఈయనే. కాని ఈయన చనిపోయిన తరువాత, ఆయన భౌతిక కాయం మాత్రం చాల సంచలనం సృష్టించింది.సాదారణంగా ఎవరినైనా ఒక సారి పాతిపెడతారు లేదా ఖననం చేస్తారు.కాని చార్లీ చాప్లిన్ మాత్రం ఈ పరిస్థితి రెండు సార్లు ఎదుర్కొన్నారు. అదెలా అంటారా? వివరాలు చూద్దాం రండి…….
చార్లీ చాప్లిన్ 1977 డిసెంబర్ 25 న మరణించారు. ఆయన మృతదేహాన్ని స్విట్జర్లాండ్ లోని కోర్సియర్ అనే గ్రామంలోని శ్మశానంలో ఖననం చేశారు. కాని 1978 మార్చ్ 21 న ఇద్దరు దొంగలు ఆ శవాన్ని ఎత్తుకుపోయి, పాతిపెట్టిన ప్రదేశానికి 16 కిమీ దూరం లో దాచిపెట్టారు. దీనితో ఇదిఒక పెద్ద మిస్టరీ గా, మారి ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది.ఇక పోలీసులు ఛాలెంజింగ్ తీసుకొని ఆ దొంగల్ని పట్టుకొని ఆ శవాన్ని మళ్ళ తీసుకువచ్చి, దానికి శవ పరిక్షలు జరిపి అది చార్లీ చాప్లిన్ మృత దేహమే అని నిర్ధారించిన తరువాత మళ్లీ అదే ప్లేస్ లో ఖననం చేసారు.