‘గుంటూరు కారం’.. ఈ సినిమా గురంచి ఎంత చెప్పుకున్నా సమయం సరిపోదు. ఎందుకంటే ఈ చిత్రం గురించి సినిమా టీమ్ అనౌన్స్‌మెంట్లు, సమాచారాలు కంటే పుకార్ల షికార్లే ఎక్కువగా ఉంటాయి. సినిమా అనుకోవడం మొదలు, ఇప్పుడు సినిమా షూటింగ్ వరకు, టైటిల్ నుండి సినిమా కాన్సెప్ట్ వరకు… సినిమా రిలీజ్ నుండి కాస్ట్ అండ్ క్రూ వరకు ఇలా అన్నీ కథలు కథలుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా కథ గురించి తాజాగా ఓ పుకారు వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా సినిమాలను అనలైజ్ చేయడం, సమాచారం ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించే ఐఎండీబీ వెబ్‌సైట్‌లో ఈ సినిమా గురించి ఓ సమాచారం రాశారు. అందులో ఈ సినిమా ప్రాథమిక కథ ఏంటి అనే విషయంలో చిన్నపాటి క్లారిటీ ఇచ్చారు. అందులో నిజమెంత అనేది తేలకపోయినా… ఆసక్తికరంగా ఉండటంతో ఇదే సినిమా కథ అంటూ ఓ ప్రచారం టాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో సాగుతోంది. ఇదిగో ఇదే ‘గుంటూరు కారం’ కథ అంటూ ఫ్యాన్స్ షేర్ చేసుకుంటున్నారు.
ఐఎండీబీ చెప్పినదాని ప్రకారం చూస్తే… ఈ సినిమాలో మహేష్‌బాబు డాన్ పాత్రలో కనిపిస్తాడు అని సమాచారం. డాన్ అంటే అండర్ వరల్ట్ డాన్ కాదు.. గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో కాస్త పేరున్న వ్యక్తి అనుకోవచ్చు. తన అనుకున్నవాళ్లకు అన్యాయం జరిగింది అంటే… అడ్డంగా నిలబకడపోయే రకం అనుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఓ లేడీ జర్నలిస్ట్‌తో ప్రేమలో పడతాడు. ఆమె అక్కడ జరిగే అక్రమాల మీద పోరాటం చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఏం జరిగింది అనేదే సినిమా కథ అని అంటున్నారు.
అయితే దీనిపై క్లారిటీ రావాలని మనం ఆశించడం అత్యాశే అవుతుంది. ఇక ఈ సినిమా సంగతి చూస్తే మహేష్‌బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఒక టీజర్ వీడియో, పోస్టర్లు వచ్చాయి. వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ సాంగ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.