Gurthunda Seethakalam: గుర్తుందా శీతాకాలం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్, స్టార్ హీరోయిన్ తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గుర్తుందా శీతాకాలం. ఈ మూవీలో ప్రియదర్శి, సుహాసిని కూడా ముఖ్య పాత్రలు పోషించారు. నాగశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు. వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి బ్యానర్ల పై రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్ లు కలిసి నిర్మించారు. గాడ్ ఫాదర్ చిత్రానికి డైలాగ్స్ రాసిన లక్ష్మీ భూపాల్ ఈ చిత్రానికి కూడా డైలాగ్స్ అందించగా కాలభైరవ సంగీతం అందించాడు.

సత్యదేవ్ కు స్ట్రాంగ్ థియేట్రికల్ హిట్టు లేకపోయినా ఈ మూవీకి డీసెంట్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే:

నైజాం 0.60 cr
సీడెడ్ 0.22 cr
ఏపీ 0.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.10 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.72 cr

గుర్తుందా శీతాకాలం చిత్రానికి రూ.1.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సత్యదేవ్ నటించిన సినిమాలు థియేటర్లలో అస్సలు నిలబడటం లేదు. ఇప్పుడు హిట్2 వంటి సూపర్ హిట్ మూవీ అలాగే ముఖచిత్రం వంటి క్రేజీ మూవీస్ పోటీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సత్యదేవ్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus