Lavanya Tripathi: లావణ్య మూవీకి లాభాలు అలా వచ్చాయా?

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన లావణ్య త్రిపాఠి ఈ నెల 8వ తేదీన హ్యాపీ బర్త్ డే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారనే సంగతి తెలిసిందే. సత్య, వెన్నెల కిషోర్, నరేష్ అగస్త్య కీలక పాత్రల్లో రానా రితేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచినా తొలిరోజు ఈ సినిమాకు కేవలం 41 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

శని, ఆదివారాలలో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన విధంగా లేవు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విడుదలైన ఈ సినిమా ఆ సంస్థకు భారీ షాకిచ్చిందనే చెప్పాలి. క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. పరిమిత బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. కథ, కథనాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం సినిమాకు మైనస్ అయింది.

ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నా ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు చిరాకు తెప్పించే విధంగా ఉండటం గమనార్హం. అయితే ఈ సినిమా ఫ్లాపైనా నిర్మాతలకు మాత్రం లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి విక్రయించారని తెలుస్తోంది. అందువల్ల నిర్మాతలకు మాత్రం నష్టాలు వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కు ఉన్న గుర్తింపు వల్ల ఊహించని రేట్ కు హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సరైన కథను ఎంచుకోని పక్షంలో నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మైత్రీ నిర్మాతలు కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus