Happy Days Collections: ‘హ్యాపీ డేస్’ కు 14 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • January 16, 2022 / 06:14 PM IST

కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇంకొన్ని సినిమాలు మనల్ని అలరించడమే కాకుండా థియేటర్ నుండీ బయటకి వచ్చాక కూడా మనల్ని వెంటాడతాయి. మరికొన్ని సినిమాలు అయితే ఏళ్ళు గడుస్తున్నా మన గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి సినిమానే ‘హ్యాపీ డేస్’. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించే సినిమాలు అన్నీ అలాగే ఉంటాయి లెండి. ఆయన తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తుంటే.. ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనే డౌట్ మీకు రావచ్చు. ఏమీ లేదండి ‘హ్యాపీ డేస్’ చిత్రం రిలీజ్ అయ్యి ఈరోజుతో 14 ఏళ్ళు పూర్తికావస్తోంది. 2007 వ సంవత్సరం అక్టోబర్ 2న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో బి.టెక్ లైఫ్ ను ఆద్యంతం ఎంటర్టైన్ చేసే విధంగా చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇదిలా ఉండగా..

ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.57 cr
సీడెడ్ 2.93 cr
ఉత్తరాంధ్ర 1.82 cr
ఈస్ట్ 1.42 cr
వెస్ట్ 0.93 cr
గుంటూరు 0.98 cr
కృష్ణా 1.05 cr
నెల్లూరు 0.77 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 15.47cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 3.12 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.59 cr

‘హ్యాపీ డేస్’ చిత్రాన్ని కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ లోనే తెరకెక్కించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ చిత్రాన్ని దిల్ రాజు ద్వారా రిలీజ్ చేయించాడు. బ్రేక్ ఈవెన్ కు రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.18.59 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే రూ.13.59 కోట్ల లాభాలను మిగిల్చిందన్న మాట.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus