పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతి కృష్ణ కలయికలో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం గత వారం రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు, అలాగే ప్రీమియర్స్ తో సూపర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ 2వ రోజు నుండి డౌన్ అయ్యింది. అయినప్పటికీ వీకెండ్ వరకు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి అనే చెప్పాలి. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది. ఏదేమైనా మొదటి వారం యావరేజ్ గా రాణించిన ఈ సినిమా 2 వ వారంలో అడుగుపెట్టింది. 2వ వారం చాలా వరకు థియేటర్లను ‘ మహావతార్ నరసింహ’ కి ‘కింగ్డమ్’ కి షేర్ చేయాల్సి వచ్చింది.
అయినప్పటికీ మిగిలిన థియేటర్లలో కొద్దిపాటి మెరుపులు మెరిపించే ప్రయత్నం చేస్తుంది ‘హరి హర వీరమల్లు’. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
16.76 cr
సీడెడ్
7.95 cr
ఉత్తరాంధ్ర
6.72 cr
ఈస్ట్
4.80 cr
వెస్ట్
3.99 cr
గుంటూరు
4.58 cr
కృష్ణా
4.19 cr
నెల్లూరు
1.76 cr
ఏపీ+తెలంగాణ
50.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
4.88 cr
ఓవర్సీస్
6.42 cr
వరల్డ్ టోటల్
62.05 cr (షేర్)
‘హరిహర వీరమల్లు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.62.05 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.101.71 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.58.95 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి 2వ వారాంతంలో ఎంత వరకు రాబడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.