పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కంప్లీట్ చేయాల్సిన సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కూడా ఉంది. ‘వకీల్ సాబ్’ తో (Vakeel Saab) పాటు అనౌన్స్ చేసిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా ప్రకటించడం జరిగింది. క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాకి ఏ.ఎం.రత్నం (AM Rathnam) నిర్మాత. పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ చేయడం వల్ల.. ఇది దాదాపు 4 ఏళ్ళు లేట్ అయ్యింది. మధ్యలో కరోనా వచ్చి లాక్ డౌన్ పడటం, తర్వాత పవన్ కళ్యాణ్ వేరే ప్రాజెక్టులకు షిఫ్ట్ అవ్వడం..
సమాంతరంగా రాజకీయాల్లో కూడా బిజీగా ఉండటం వల్ల.. ‘హరిహర వీరమల్లు’ ఆలస్యమవుతూ వచ్చింది అని చెప్పాలి. మరోపక్క ఎన్నికల టైం వల్ల కూడా డిలే అవుతూ వచ్చింది. మధ్యలో దర్శకుడు క్రిష్ తప్పుకోవడం, తర్వాత ఏ.ఎం.రత్నం కొడుకు రత్నం కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ మార్చి 28న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్ పనులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మరోపక్క ‘రాబిన్ హుడ్’ మార్చి 28కి వస్తుంది అని ప్రకటించారు.
అలాగే మార్చి 29న ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా వస్తుందని ప్రమోషన్స్ మొదలుపెట్టారు. వీటిని బట్టి ‘హరిహర వీరమల్లు’ మార్చి 28 కి రావడం లేదు అని క్లియర్ గా తెలుస్తుంది. అయినప్పటికీ మేకర్స్ అదే డేట్ తో ఉన్న పోస్టర్స్ వదులుతున్నారు. మరోపక్క ‘హరిహర వీరమల్లు’ ని ఆగస్టు నెలకి పోస్ట్ పోన్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు టాక్. ఈ సినిమాలో కూడా దేశభక్తికి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి కాబట్టి.. అదే కరెక్ట్ టైం మేకర్స్ భావిస్తున్నారట.