బిగ్ బాస్ 4: అదే హారికలో ఉన్న బలం..!

  • December 7, 2020 / 02:53 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ వారం వచ్చేసరికి లెక్కలు మారుతున్నాయి. ప్రస్తుతం ఆఖరి నామినేషన్స్ లో అఖిల్ తప్ప మిగతా ఇంటిసభ్యులు అందరూ నామినేట్ అయినట్లుగా సమాచారం. ఇదే గనక జరిగితే ఖచ్చితంగా ముగ్గురు అమ్మాయిలు డేంజర్ జోన్ లో పడతారు. అందులో హారిక, అరియనా ఇంకా మోనాల్ లు ఉంటారు. సోషల్ మీడియాలో ఈవారం మోనాల్ సేఫ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, అరియానా ఇంకా హారికలతో పోలిస్తే మోనాల్ కి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ. అరియానాకి కూడా హారికతో పోలిస్తే ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువే చెప్పాలి.

ఎందుకంటే, ఫస్ట్ నుంచి టైటిల్ ఫేవరెట్ రేసులో దూసుకుపోతోంది హారిక. ఇప్పటివరకూ ఆడిన ప్రతి టాస్క్ లో మగాళ్లకి ధీటుగా గేమ్ ఆడింది. అంతేకాదు, దేత్తడితో పెట్టుకుంటే చిత్తడి చిత్తడే అన్నట్లుగా గేమ్ ఆడింది. సో,ఇప్పుడు ఫినాలే రేస్ వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేయడానికి రెడీగా ఉంటారు. అంతేకాదు, తనకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ. డిజిటల్ మీడియాలో యూత్ , టీనేజర్స్ చాలా యాక్టీవ్ గా ఉంటారు.

వీళ్లందరూ హారిక ఫ్యాన్సే. అంతేకాదు, చిన్న చిన్న పిల్లలు కూడా హారక అక్కా అంటూ బాగా లైక్ చేస్తారు. సో, హారికకి ఉన్న బలం ఇదే. అందుకే ఇప్పుడు ఫినాలే వారం కాబట్టి ప్రతి ఇంటి నుంచి హారికకి ఓట్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అంతేకాదు, ఫైనల్స్ లో టాప్ 5 లో కూడా లాస్ట్ వీక్ లో పొజీషన్స్ మారే అవకాశం కూడా ఉంది. హారిక – అభిజిత్ – సోహైల్ – అఖిల్ వీళ్ల నలుగురులోనే టైటిల్ అనేది ఊగిసలాడుతుంది కూడా. ఫైనల్ వారం ఓటింగ్ అనేది ఎవ్వరూ ఊహించని విధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి హారిక ఇప్పుడు టైటిల్ ఫెవరెట్ గా బిగ్ బాస్ హౌస్ లో నిలించింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అదీ మేటర్.

[yop_poll id=”1″]
Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus