Harish Shankar: ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై హరీశ్‌శంకర్‌ గూస్‌బంప్స్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

అభిమాన హీరోతో ఓ దర్శకుడు సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే విషయంలో చెప్పాలంటే రీసెంట్‌ సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ చెప్పొచ్చు. అయితే 11 ఏళ్ల క్రితమే ఇలాంటి ఓ సినిమా వచ్చింది. అదే ‘గబ్బర్‌ సింగ్‌’. ఆ హీరో పవన్‌ కల్యాణ్‌ అయితే, ఆ అభిమాని హరీశ్‌ శంకర్‌. ఈ కాంబినేషన్‌లో కుదిరినప్పుడు అంతా చిన్నగా నిట్టూర్చినా.. ఆ తర్వాత అవుట్‌పుట్‌ చూసి వావ్‌ అనుకున్నారు. ఆ కాంబినేషన్‌ ఇప్పుడు మళ్లీ కలిసింది. దీంతో మరోసారి అంచనాలు ఉన్నాయి.

అయితే, గత కొన్ని నెలలుగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో సినిమా మీద బజ్‌ తగ్గింది అని చెప్పాలి. కానీ 11వ తేదీ రిలీజ్‌ చేసిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ గ్లింప్స్‌తో మరోసారి సినిమా బజ్‌ పీక్స్‌కి వెళ్లింది అని చెప్పాలి. అయిత ఈ గ్లింప్స్‌ను ఓ సింగిల్‌ థియేటర్‌లో వేసి చూపించారు. ఫ్యాన్స్‌ అయితే ఫుల్‌ జోష్‌లో చూసి ఎంజాయ్‌ చూసి.. ఇప్పుడు యూట్యూబ్‌లో మళ్లీ మళ్లీ చూసే పనిలో ఉన్నారు. మరిలాంటి స్టఫ్‌ ఇచ్చిన హరీశ్‌ శంకర్‌ ఏమన్నారు అనేది కూడా చదవాలి కదా.

హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) ఎక్కువ చెప్పకపోయినా.. ఆయన మనసులో మాట చెప్పేశారు. గ‌బ్బ‌ర్ సింగ్ మే 11, 2012న విడుదలైంది. ఆ స్పెషల్‌ డేను సెలబ్రేట్ చేసుకునే పనిలోనే ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ ఫ‌స్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు. ఆ వేడుకలో చిత్ర నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌, ద‌శ‌ర‌థ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హరీష్ శంక‌ర్ మాట్లాడుతూ ‘‘గ‌బ్బ‌ర్ సింగ్’ మ‌న ప‌దేళ్ల ఆక‌లిని తీర్చింది. ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ కోసం నేను 11 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను’’ అని చెప్పారు.

ఈ క్రమంలో నా మీద ఎంతమంది, ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా మీకు ఈ గ్లింప్స్ చూపించాల‌ని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చేసి చూపించాను. ఎందుకంటే నేను మీలో ఒక‌డిని అంటూ తన మనసులో బాధను, మాటను, ఆనందాన్ని చెప్పారు హరీశ్‌ శంకర్‌. తమిళనాట మంచి విజయం అందుకున్న ‘తెరి’ కథను తీసుకొని ఈ సినిమా సిద్ధం చేస్తున్నారని సమాచారం.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus