హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం ఒక వారంలో 100 కోట్లు వసూలు చేసినట్లు పోస్టర్స్ విడుదల చేయడం చర్చకు దారి తీసింది. ఈ లెక్కలు చూసి బన్నీ అభిమానులు సంబర పడుతుంటే.. మరికొంతమంది మాత్రం సినిమాలో ఏమీ కొత్తదనం లేదు.. అటువంటి మూవీ వందకోట్లు వసూలు చేయడం అసాధ్యమని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు డీజే కలక్షన్స్ అంతా అబద్ధం అని కథనాలు రాశాయి. దీనిపై డైరక్టర్ హరీష్ శంకర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో డీజే ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో సూచిస్తూ ఒక పట్టికను అందించారు. వాటిలో ఉన్న లెక్కలు తప్పని నిరూపిస్తే తాను సినిమాలు చేయనని స్పష్టం చేశారు. అది నిజం అని తెలిస్తే తప్పుడు వార్తలు రాసే సైట్లు మూసుకోవాలని హెచ్చరించారు.
13 రోజుల్లో నైజాం ఏరియాల్లో డీజే షేర్ వసూళ్లు..( హరీష్ పోస్ట్ చేసిన నివేదిక ప్రకారం) …
మల్టీఫ్లేక్స్ లలో (తెలంగాణ) : 41177221
హైదరాబాద్ సింగల్ స్క్రీన్ లలో : 55937925
వరంగల్ : 13099873
ఖమ్మం : 13525370
కరీంనగర్ : 14223949
నిజామాబాద్ : 7799341
మహబూబ్ నగర్ : 15179376
నల్లగొండ : 12879916
ఆదిలాబాద్ :9226536
మెదక్ :9626544
వికారాబాద్ : 3624718
రాయచూర్ :4916159
మొత్తం : 20,1216928
ఈ కలక్షన్స్ ఛాలంజ్ కి ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.