Gnanasagar Dwaraka: ‘హరోం హర’ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు.. అస్సలు ఊహించలేదుగా..!

సుధీర్ బాబు (Sudheer Babu) సినిమాలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ ఏదీ కూడా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం లేదు.అయినా అతను కష్టపడి పని చేస్తున్నాడు. అతను హీరోగా ‘హరోం హర’ (Harom Hara) రూపొందింది. ‘శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్’ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు (Sumanth G Naidu) నిర్మించిన ఈ చిత్రాన్ని ‘సెహరి’ (Sehari) ఫేమ్ జ్ఞాన సాగర్ ద్వారక (Gnanasagar Dwaraka)  డైరెక్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్.. సినిమా పై ఆసక్తిని కలిగించాయి. ‘తుపాకులు తయారు చేసే వ్యక్తిగా..

ఓ సాధారణ వ్యక్తి నుండి అసాధారణ శక్తిగా ఎదిగిన పవర్ఫుల్ లీడర్ గా’ ఈ సినిమాలో సుధీర్ బాబు కనిపించనున్నాడు. జూన్ 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా అతను కొన్ని ఊహించని కామెంట్లు చేసి హాట్ టాపిక్ అయ్యాడు. విషయం ఏంటంటే.. జ్ఞాన సాగర్ ద్వారక, తాను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘సెహరి’ ని ఇప్పటివరకు చూడలేదట.

కనీసం ఓటీటీలో కూడా ఆ సినిమాని చూసే ప్రయత్నం ఒక్కసారి కూడా చేయలేదట. అసలు లవ్ స్టోరీస్ చేయడం తనకు నచ్చదని, కథ కూడా తనది కాదని ఈ సందర్భంగా అతను చెప్పుకొచ్చాడు. అయితే ‘సెహరి’ సినిమా వల్లే తనకు ‘హరోం హర’ వంటి పెద్ద సినిమా ఛాన్స్ వచ్చిందని ఈ యంగ్ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. 2022 ఫిబ్రవరి లో రిలీజ్ అయిన ‘సెహరి’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus