అల్లు వారి హీరో అల్లు అర్జున్ ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయి. చేసే ప్రతి సినిమా వెనుక అనేక లెక్కలు ఉంటాయి. తెర ముందే కాకుండా తెర వెనుక కూడా బన్నీ అనేక విషయాల్లో ఇన్వాల్వ్ అవుతారు. శత చిత్రాల దర్శకుడు కె రాఘవేంద్రరావు తో తొలి సినిమా గంగోత్రి చేసిన బన్నీ ఆ తర్వాత కొత్త దర్శకుడు సుకుమార్ తో సినిమా చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. అయితే ఆ తర్వాత నూతన దర్శకులను పక్కన పెట్టి.. హిట్ కొట్టిన డైరక్టర్ తో సినిమా చేయడం మొదలు పెట్టారు. డీజే తర్వాత బన్నీ ఆలోచనలో మార్పు వచ్చిందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అందుకు కారణం రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేయడమే. రేసుగుర్రం, కిక్, టెంపర్ వంటి సినిమాలకు కథ అందించిన వంశీ తో నా పేరు సూర్య అనే సినిమాని చేస్తున్నారు.
దీని తర్వాత కూడా అల్లు అర్జున్ కొత్తవారికి ఛాన్స్ ఇస్తున్నట్టు సమాచారం. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అల్లు అర్జున్ తో వచ్చే సంవత్సరం మొదలు పెట్టబోతున్నారు. ఈ నిర్మాణ సంస్థలోని డైరెక్టర్ డిపార్టమెంట్ లో పనిచేస్తున్న ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ ప్రశాంత్, సంతోష్ రెడ్డిలు చెప్పిన రెండు డిఫరెంట్ కథలు అల్లు అర్జున్ కి నచ్చాయని టాక్. స్క్రిప్ట్ కంప్లీట్ అయితే సంతోష్ రెడ్డి కథతో యూవీ క్రియేషన్ బ్యానర్ పై అల్లుఅర్జున్ సినిమా చేయడం పక్కా అని అల్లు క్యాప్ నుంచి వార్త అందింది. బన్నీ సడన్ గా యువ డైరక్టర్స్ పై ఆసక్తి కనబరుస్తుండడంపై సీనియర్ డైరక్టర్స్ చర్చించుకుంటున్నారు.