Hebah Patel: హెబ్బాను ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చూసుండరు..!

టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ సినిమా సినిమాకీ డిఫరెన్స్ చూపిస్తూ… గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ‘కుమారి 21ఎఫ్’ బ్రేక్ ఇచ్చినా.. తర్వాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి సూపర్ హిట్ కొట్టినా కానీ ఎందుకో అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. స్పెషల్ సాంగ్స్ చేసిన ‘భీష్మ’, ‘రెడ్’ మూవీస్ కాకుండా.. వరుసగా ఆరు సినిమాల పరాజయంతో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది.

ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ లో డీ గ్లామర్ రోల్‌లోనూ అందాలారబోసిన హెబ్బా ఇప్పుడు ‘బ్లాక్ అండ్ వైట్’ అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చేస్తోంది. సూర్య శ్రీనివాస్, బిగ్ బాస్ లహరి, నవీన్ నేని కీలకపాత్రల్లో నటించగా.. ఎల్.వి.ఎన్. సూర్య ప్రకాష్ డైరక్ట్ చేశాడు. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, స్టార్ అండ్ సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి, టీంకి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

‘నో కమిట్‌మెంట్, నో కంట్రోల్, నో రెస్ట్రిక్షన్స్’ అంటూ హెబ్బా వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ‘బ్లాక్ అండ్ వైట్’ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. హెబ్బా పటేల్ గ్లామర్ డోస్ పెంచి కనిపిస్తుంది.. అలాగే హీరోతో రొమాన్స్… ఊహించని మలుపులు, గెస్ చెయ్యలేని ట్విస్టులతో హైప్ క్రియేట్ చేసిందీ టీజర్. సినిమాలో ఏవో సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయనే హింట్ ఇచ్చాడు డైరెక్టర్.

గమనిస్తే.. హెబ్బా డ్యుయల్ రోల్ చేస్తుందేమోననే డౌట్ కూడా కలుగుతుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న హెబ్బా.. ఈ మూవీ బ్రేక్ ఇస్తుందని ఆశలు పెట్టుకుంది. రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ‘బ్లాక్ అండ్ వైట్’ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మేఘనా రెడ్డి సమర్పణలో ఎస్‌ఆర్‌ ఆర్ట్స్‌/ఏయూ, ఐ స్టూడియోస్‌ బ్యానర్ల మీద పద్మనాభరెడ్డి, సందీప్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘బ్లాక్ అండ్ వైట్’ రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చెయ్యనున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!


ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus