‘ఖిలాడీ’ సినిమా చూశారా? చూస్తే అందులో రవితేజ కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా? భలే యాక్టివ్‌గా ఉంది కదా ఆ చిన్నారి. ఆ అమ్మాయిది మన కృష్ణ జిల్లా నందిగామే. ఆ చిన్నారి పేరు శాన్విత. సినిమాలో చిన్నూగా అందరినీ అలరించింది. ఇప్పుడు అందరూ ఆ అమ్మాయి గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలోనూ శాన్విత ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె మరో ఏడు సినిమాలు చేస్తోంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నాలుగేళ్ల వయసులో శాన్వితకు సినిమాల్లో నటించే అవకాశం దక్కిందట. అభినయం, అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం చిన్నారి శాన్వితకు ఆరేళ్లు. బాలిక తల్లిదండ్రులు డాక్టర్లు. కుమార్తెకు అంతటి పేరు రావడంతో ఆమె తల్లిదండ్రులు మందడపు రంగనాధ్, పరిమిళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రూహిణ్య కాగా శాన్విత చిన్నమ్మాయి. చిన్నతనం నుండి రుహిణ్య, శాన్విత చలాకీగా ఉండేవారట. ప్రస్తుతం శాన్విత విజయవాడ పోరంకిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది.
హైదరాబాద్‌లో బంధువుల ఇంటిలో ఓ ఫంక్షన్‌కు వెళ్లిన శాన్విత… అక్కడ కొన్ని ఫొటోలు దిగింది. వాటిని ఫేస్‌బుక్‌లో పెడితే.. చూసిన దర్శకుడు యోగి, తన స్నేహితుడు సురేష్‌కు ఆ ఫొటోలను పంపించాడట. అలా ఫొటోలు చూసి శాన్విత నాలుగున్నరేళ్ల వయసులో తొలి సినిమా అవకాశం ఇచ్చారట. ఆ తర్వాత ‘శ్రీకారం’, ‘ఖిలాడీ’ సినిమాల్లో చక్కటి పాత్రలు దక్కించుకుందట. ఇప్పుడు ‘కిన్నెరసాని’, ‘జెట్టి’, ‘సిగ్ధ’, ‘లోకం ఎలా ఉంది నాయనా’, ‘సలార్’, ‘గాలీవాన’ తదితర చిత్రాల్లో నటిస్తోందట.
‘ఖిలాడీ’ సినిమాలో ఓ సీన్‌లో గ్లిజరిన్ వాడకుండానే కన్నీరు తెచ్చుకుని మరీ చక్కగా నటించిందట శాన్విత. పెద్దయ్యాక వ్యోమగామినవుతానని అంటున్న శాన్వితకు… లాలీపప్, ఖాజా బర్ఫీ అంటే బాగా ఇష్టమని చెబుతోంది. షూటింగ్‌లో రవితేజతో బాగా ఆడుకుంటూ నటించానని చెబుతూ మురిసిపోయింది శాన్విత. ఫిబ్రవరి 11న విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి నటించారు.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!