Mathu Vadalara 2: మత్తు వదలరా2లో సత్య డ్యాన్స్ వెనుక అంత కథ ఉందా?

గతవారం విడుదలై సూపర్ హిట్ కొట్టిన “మత్తు వదలరా 2”  (Mathu Vadalara 2)   సినిమాలో సత్య (Satya) కామెడీ విశేషంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో సత్య చాలా ఈజ్ తో డ్యాన్స్ చేసిన చిరంజీవి (Chiranjeevi) “లంకేశ్వరుడు” (Lankeswarudu) సినిమాలోని 16 ఏళ్ల వయసు పాటకు భారీ రెస్పాన్స్ వస్తోంది. సేమ్ టు సేమ్ చిరంజీవి మాదిరిగానే అదే గెటప్ లో సత్య వేసిన డ్యాన్సులు బాగా వైరల్ అవుతున్నాయి.

Mathu Vadalara 2

అయితే.. నిజానికి సత్య ఈ డ్యాన్స్ స్టెప్పులు వేసింది “మత్తు వదలరా 2” సినిమా కోసం కాదట. ఈ సాంగ్ సీక్వెన్స్ ను ఎప్పుడో 2019లో ప్రీక్వెల్ టైమ్ లో షూట్ చేసారు. అయితే ఆ సినిమా రిలీజ్ టైమ్ కి ఎడిటింగ్ లో తీసేసారు. కానీ.. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం విడుదల చేసిన మేకింగ్ వీడియోలో ఈ డ్యాన్స్ స్టెప్స్ ఉన్నాయి. అందుకే సత్య గెటప్ & లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

ఇకపోతే.. సత్య ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా మారిపోయాడు. “మత్తు వదలరా 2”కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఈవారం గ్యాప్ లో ఆల్మోస్ట్ ఏడెనిమిది సినిమాల్లో బుక్ అయ్యాడని వినికిడి. ఈ ఫ్లో ఇలాగే కొనసాగితే ఇండస్ట్రీ వర్గాలు అంటున్నట్లు బ్రహ్మానందం తర్వాత రోజుకి 5 లక్షల తీసుకొనే కమెడియన్ గా సత్య చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. అయితే..

ఈ సమయంలో సత్య తాను నటించే సినిమాలను, పోషించే పాత్రలను ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటాడు అనేది చాలా కీలకపాత్ర పోషించనుంది. ఎందుకంటే.. వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేసేస్తే కూడా ప్రాభవం కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఈవారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు కాబట్టి “మత్తు వదలరా 2” రెండోవారం కూడా థియేటర్లలో రచ్చ చేయడం ఖాయం.

మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఆలోచనలు మారడానికి రీజన్లు ఇవేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus