Mokshagnya: మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఆలోచనలు మారడానికి రీజన్లు ఇవేనా?

నందమూరి మోక్షజ్ఞ (Mokshagnya) సినీ ఎంట్రీ గురించి వార్తలు ప్రచారంలోకి రావడం కొత్తేం కాదు. దాదాపుగా ఐదారు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి జోరుగా చర్చ జరుగుతుండగా ఎట్టకేలకు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఫిక్స్ అయింది. అయితే బాలయ్య (Balakrishna) మొదట మోక్షజ్ఞ హీరోగా ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాను తెరకెక్కించాలని భావించారు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించాలని ఫీలయ్యారు. అయితే నందమూరి ఫ్యాన్స్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  లా మోక్షజ్ఞ కూడా మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

Mokshagnya

బాలయ్య సైతం ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  చెప్పిన కథ కూడా అద్భుతంగా ఉండటం, ఆదిత్య 369 (Aditya 369) మ్యాక్స్ కంటే ఈ సినిమా వేగంగా పూర్తయ్యే ఛాన్స్ ఉండటం, హనుమాన్ (Hanuman) సినిమా వల్ల ప్రశాంత్ వర్మకు ఊహించని స్థాయిలో వచ్చిన క్రేజ్ వల్ల ఈ ప్రాజెక్ట్ వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. ఆదిత్య 369 మ్యాక్స్ కు అత్యంత భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉండటంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి సినిమాలను తెరకెక్కించే ప్రతిభ ఉన్న దర్శకులు సైతం చాలా తక్కువమంది ఉంటారు.

బాలయ్యకు సైతం డైరెక్షన్ పై ఆసక్తి ఉన్నా తను నటించే సినిమాలను పక్కన పెట్టి ఈ సినిమాపై ఫోకస్ చేయలేరనే సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తెరకెక్కనుండగా ఈ సినిమా ఎలా ఉండబోతుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. మోక్షజ్ఞ తొలి సినిమాకే 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. 2025 సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.

ఆదిపురుష్ తెలుగు సినిమా కాదంటావా సైఫ్ భాయ్ ?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus