కోలీవుడ్ హీరో అజిత్ తండ్రి కన్నుమూత.. ఆ సమస్యలతో?

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కు తమిళంతో పాటు ఇతర భాషల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ ఏడాది తునివు సినిమాతో అజిత్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో అజిత్ బిజీగా ఉండగా అజిత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అజిత్ తండ్రి సుబ్రమణియన్ మరణ వార్త అభిమానులను షాక్ కు గురి చేసింది.

అజిత్ తండ్రి సుబ్రమణియన్ మరణ వార్త విని ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. తమిళనాడు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సుబ్రమణియన్ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అజిత్ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సుబ్రమణియన్ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

అజిత్ తండ్రి మరణ వార్త కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అభిమానులు సుబ్రమణియన్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని అజిత్ కుటుంబానికి దేవుడు ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అజిత్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం వెనుక తండ్రి పాత్ర ఎంతో ఉంది. చెన్నైలోని బీసెంట్ నగర్ లో ఉన్న శ్మశాన వాటికలో ఈరోజు సుబ్రమణియన్ అంత్యక్రియలు జరగనున్నాయి.

ప్రస్తుతం అజిత్ దుబాయ్ లో ఉండగా తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే ఆయన చెన్నైకు బయలుదేరారు. ప్రస్తుతం సుబ్రమణియన్ వయస్సు 84 సంవత్సరాలు కాగా వయస్సు సంబంధిత సమస్యలతో ఆయన గత కొంతకాలంగా బాధ పడుతున్నారని సమాచారం. అజిత్ తండ్రి సుబ్రమణియన్ మలయాళీ కాగా అతనికి ముగ్గురు పిల్లలు. మరోవైపు అజిత్62 మూవీ మగిజ్ తిరుమేని డైరెక్షన్ లో తెరకెక్కనుంది. త్వరలో ఈ సినిమా షూట్ మొదలుకానుందని తెలుస్తోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags