నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధరణి అనే నెవర్ బిఫోర్ మాస్ రోల్ లో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సందర్భంగా నాని షేర్ చేసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం :
ప్ర) ‘దసరా’ సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
నాని : సినిమా చూసిన వాళ్లంతా చాలా మంచి సినిమా అని చెబుతున్నారు. రిలీజ్ రోజు నుండి అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఇంకా వస్తూనే ఉన్నాయి.’ఇందుకోసమే కదా సినిమా తీశాం’ కదా అనిపించింది. నంబర్స్ అనే విషయాన్ని నేను పట్టించుకోవడం లేదు.. అవి కూడా మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నాయి. ఫైనల్ గా రెస్పాన్స్ ను మేము ఎంజాయ్ చేస్తున్నాం.
ప్ర) ‘దసరా’ ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్లు ఏమైనా ఉన్నాయా ?
నాని : ‘దసరా’ లో ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ ఏదీ లేదు. అన్నీ కూడా చాలా కష్టపడి చేసిన సీన్లే. దుమ్ము, ధూళి, వేడి మధ్య పని చేశాం. అయితే బాగా వస్తున్నాయని ఫీలింగ్ మాత్రం అన్ని సీన్లకి అనిపించింది.
ప్ర) రాంచరణ్ కు ‘రంగస్థలం’, అల్లు అర్జున్ కి ‘పుష్ప’.. మీకు ‘దసరా’ అంటూ సోషల్ మీడియాలో అంటున్నారు.ఇది మీకు తృప్తినిస్తుందా?
నాని: ఈ విషయంలో నటుడిగా నేను ఆనందపడతాను. కానీ తృప్తి పడను. ఈ ప్రశ్నకి ఇదే జవాబు మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను. యాక్టర్ గా నేను తృప్తి పొందాను అంటే.. ఆరోజున ఇక నేను చేయడానికి ఏమీ లేదు అని నేను అనుకుంటాను.
ప్ర) ‘దసరా’ కథ విన్నప్పుడే శ్రీకాంత్ పై అంత నమ్మకం ఎలా ఏర్పడింది?
నాని : ఈ కథ వింటున్నప్పుడే దర్శకుడు శ్రీకాంత్ బెస్ట్ టెక్నీషియన్ అనిపించింది. అందుకే ఇండస్ట్రీకి శ్రీకాంత్ అవసరం అనిపించింది. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అని ఆరోజే అనిపించింది.
ప్ర) ‘దసరా’ నిర్మాతకి అంతకు ముందు హిట్లు లేవు.. మరి సెంటిమెంట్ గా ఏమైనా బ్యాడ్ ఫీలయ్యారా?
నాని : అసలు నేను (Nanii) అలాంటి సెంటిమెంట్లు పట్టించుకోను. మంచి సినిమా చేస్తున్నాం. అది చూసి డిసైడ్ చేయాల్సింది ప్రేక్షకులు. ఇదొక్కటే నా మైండ్లో ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ రాలేదా. అందరూ హ్యాపీనే కదా.
ప్ర) ‘దసరా’ అనేది పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని స్టార్ట్ చేసినప్పుడే డిసైడ్ అయ్యారా?
నాని : ఇది చాలా సార్లు చెప్పాను. కానీ ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. పాన్ ఇండియా సినిమా చేసెయ్యాలి అనుకుంటే చేయలేము. కథ డిసైడ్ చేయాలి. ఇప్పుడు ‘దసరా’ చూశారు కాబట్టి నేను చెప్పేది మీకు అర్ధమవుతుంది. దసరా పండుగని సౌత్ తో పాటు నార్త్ లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మా కథలో రామాయణం యాంగిల్ కూడా ఉంటుంది. దానికి అందరూ కనెక్ట్ అవుతారని అనిపించి.. దీనిని పాన్ ఇండియాగా చేయడం జరిగింది. ‘కాంతార’ లో కూడా భూతకోలా అనేది మన కల్చర్. సో అందుకే దానికి పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.
ప్ర) ‘దసరా’ లో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసేయాలి అనుకున్నట్టు దర్శకుడు శ్రీకాంత్ చెప్పారు?
నాని : ఆ టైంలో వాడు తెగ ముద్దొచ్చేశాడు. వాడి కథ అంటే వాడికి అంత ఇష్టం. దాని కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి అనిపించి.. నా దగ్గరకు వచ్చి అంత ధైర్యంగా చెప్పాడు.’ ఆమె లావు అవ్వమంటే అవ్వను అంటుంది. ఆమెను తీసేద్దాం’ అని అన్నాడు. దానికి ‘నేను ఒరేయ్ లావు ఉండాల్సిన అవసరం ఏముంది’ అని మోటివేట్ చేశాను సెట్ అయ్యాడు. ఇప్పుడు కీర్తి సురేష్ లేకుండా వెన్నెల పాత్రను ఊహించుకోలేకపోతున్నాను అంటున్నాడు.
ప్ర) ‘దసరా’ కి మిగిలిన భాషల్లో కలెక్షన్స్ రావడం లేదు అనే కంప్లైంట్ ఉంది?
నాని : అన్ని భాషల్లో కలెక్షన్స్ రావడానికి నేనేమైనా అమితాబచ్చనా? జనాలు కంటెంట్ కు కనెక్ట్ అవ్వాలి. ఒక్క టిక్కెట్ తెగినా,చూసినవాడు బాగుంది అని చెప్పినా నేను సక్సెస్ అయినట్టే!
ప్ర) నార్త్ లో మీరు ఎక్కువగా ప్రమోట్ చేశారు కదా.. దాదాపు 30 రోజుల నుండి నాన్ స్టాప్ గా ప్రమోట్ చేశారు .. అక్కడ కలెక్షన్స్ రాకపోవడం అనేది బాధ అనిపించలేదా?
నాని : సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ తరన్ ఆదర్శ్ లాంటి క్రిటిక్స్ ట్వీట్లు వేశారు. అక్కడ రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. హిందీలో అంతే అక్కడ రెండో వారానికి కూడా సినిమా పికప్ అవ్వచ్చు. కానీ ఇప్పటివరకు వచ్చిన టాక్ అండ్ ఓపెనింగ్స్ తో మేము హ్యాపీ.
ప్ర) ఈ సెప్టెంబర్ వస్తే మీరు ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 15 ఏళ్లలో మీరు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి 10 మంది కొత్త దర్శకులను పరిచయం చేశారు ఇండస్ట్రీకి. అయితే ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఏ హీరోకైనా రిస్క్ వద్దు.. సేఫ్ గేమ్ ఆడాలి అనేది ఉంటుంది. అయినా ఇప్పటికీ కొత్త దర్శకులకే ఛాన్స్ ఇస్తున్నారు మీ గట్ ఫీలింగ్ ఏంటి?
నాని : సేఫ్ గేమ్ గొడవే మనకి లేదు(నవ్వుతూ) కొత్త దర్శకులని పరిచయం చేయాలని ప్రత్యేకంగా ఏమీ అనుకోను. కథ నచ్చితే చేయాలనిపిస్తే చేస్తాను. అయితే నేను పరిచయం చేసిన డైరెక్టర్స్ లో కొంతమంది మంచి పొజిషన్లో ఉండటం గర్వంగా అనిపిస్తుంటుంది.
ప్ర) నాని ని దసరా కి ముందు ,దసరా కి తర్వాత అంటున్నారు..? మీరెలా ఫీలవుతున్నారు?
నాని : నేను ప్రతి సినిమాకి ఇలాంటి మాటే వినాలి అనుకుంటున్నాను.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?