HIT3: ‘హిట్ 3’ రేంజ్ ను మరింత పెంచేలా షాకింగ్ డెసిషన్..!

‘వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2′( హిట్ : సెకండ్ కేస్). అడివి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఓవర్సీస్ లో ఆల్రెడీ షోలు పడటం.. వాటికి మంచి స్పందన లభించడం చూస్తూనే ఉన్నాం. సినిమా అంతా చాలా ఎంగేజింగ్ గా ఉందని.

ఈ సినిమాలో కిల్లర్ ఎవరో గెస్ చేయడం చాలా కష్టమని, సోషల్ మీడియాలో వినిపించే కథనాలు, లీకైన ట్విస్ట్ లు నిజం కాదని… అది చెప్తే స్పాయిలర్ అవుతుంది, సినిమా చూడాలనే ఆసక్తి కూడా నశిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ‘హిట్ 2’ ప్రచారంలో భాగంగా ‘హిట్ 3’ కూడా ఉంటుందని..! ‘హిట్ : 3వ కేసులో’ హీరోగా ఎవరు కనిపించబోతున్నారు అనే విషయం పై మాత్రం క్లారిటీ వచ్చేసింది.

అందుతున్న సమాచారం ప్రకారం.. ‘హిట్3’ లో నాని హీరోగా నటించబోతున్నాడట. దానికి సంబంధించిన క్లారిటీ కూడా ‘హిట్ 2’ లో ఇచ్చినట్లు తెలుస్తుంది. ‘హిట్’ లో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. అతని థియేట్రికల్ మార్కెట్ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ‘హిట్ 2’ లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఇతని థియేట్రికల్ మార్కెట్ రూ.15 కోట్ల నుండి రూ.20 కోట్లు ఉంటుంది. ఇక ‘హిట్ 3’ లో నాని నటిస్తున్నాడు. అతని థియేట్రికల్ మార్కెట్ రూ.35 కోట్ల వరకు ఉంటుంది.

నాని ‘హిట్ 3’ లో నటించడం వల్ల ‘హిట్ 3’ స్పాన్ అనేది పెరుగుతుంది. అక్కడి వరకు ఓకే. కాకపోతే నాని నటించడం వల్ల అభిమానులు తన మార్క్ కామెడీని కూడా ఆశిస్తారు. సీరియస్ గా సాగాల్సిన థ్రిల్లర్ లో కామెడీ కనుక పెడితే.. ప్రేక్షకులకు ఆ మూడ్ అనేది ఉండదు. మరి దర్శకుడు శైలేష్ ‘హిట్3’ ని ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి..!

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus