Nani: వైరల్ అవుతున్న హీరో నాని షాకింగ్ కామెంట్స్!

ఈ మధ్య కాలంలో న్యాచురల్ స్టార్ నాని ( Nani) ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతోంది. కొన్ని రోజుల క్రితం సుకుమార్ గురించి నాని చేసిన కామెంట్ల గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వచ్చాయి. తనపై వస్తున్న ట్రోల్స్ గురించి, నెగిటివ్ కామెంట్ల గురించి నాని రియాక్ట్ కావడంతో పాటు షాకింగ్ విషయాలను వెల్లడించారు. నా అభిప్రాయం చెప్పినా సమస్య అవుతోందని నాని కామెంట్లు చేశారు. చిన్న విషయాలకే పెద్ద సమస్యలలో ఇరుక్కున్నారా అనే ప్రశ్నకు నాని స్పందిస్తూ సమస్యలను ఎదుర్కొన్నానని నేను చెప్పిన చిన్న మాటలే పెద్ద సమస్యలను సృష్టించాయని అన్నారు.

ఆ విషయాల గురించి ప్రస్తావిస్తే మరో సమస్యకు దారి తీస్తుందని నాని తెలిపారు. శ్యామ్ సింగరాయ్ రిలీజ్ సమయంలో టికెట్ ధరల గురించి నా ఒపీనియన్ ను సాధారణంగా చెప్పానని నాని కామెంట్లు చేశారు. ఆ అభిప్రాయం నాకు పెద్ద సమస్యగా మారిందని నాని చెప్పుకొచ్చారు. నేను ఏం మాట్లాడినా అలా ఎలా చెబుతున్నారని ఇలా ఎందుకు అంటున్నారని కామెంట్స్ వస్తున్నాయని నాని చెప్పుకొచ్చారు.

నేను కేవలం నా ఒపీనియన్ చెబుతున్నానని ఇతరులను కించపరిచేలా అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం లేదని న్యాచురల్ స్టార్ నాని కామెంట్లు చేయడం గమనార్హం. సుకుమార్ కు దర్శకుడిగా గొప్ప పేరు ఉండొచ్చని కానీ పుష్ప తర్వాతే ఆయనకు వేరే చోట్ల ఖ్యాతి సొంతమైందని నా డైరెక్టర్ అన్ని ఇండస్ట్రీలకు కొత్తవాడే అయినా తర్వాత మంచి పేరు సొంతం చేసుకోవచ్చని నా దర్శకుడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడినా ట్రోల్స్ చేస్తున్నారని నాని  అభిప్రాయం వ్యక్తం చేశారు.

నాని వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దసరా సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని నాని ఆశిస్తున్నారు. ఈ సినిమాతో నాని కల నెరవేరుతుందో లేదో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus