Nikhil: కొత్త మూవీతో అభిమానులకు భారీ షాకిచ్చిన నిఖిల్.. అసలేమైందంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన నిఖిల్ కు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. నిఖిల్ (Nikhil) ప్రస్తుతం స్వయంభూ (Swayambhu) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే సుధీర్ వర్మ (Sudheer Varma) డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా నటించిన “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” మూవీ దీపావళి పండుగ కానుకగా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటన వెలువడింది. ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు పూర్తైంది? అని నిఖిల్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Nikhil

రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) , దివ్యాంశ (Divyansha Kaushik) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ నుంచి ప్రకటన వెలువడింది. రెండేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తైందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కార్తికేయ2 (Karthikeya 2) సినిమాతో నిఖిల్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాకు ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తారో చూడాల్సి ఉంది. కంటెంట్ బాగుంటే ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. నిఖిల్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.

నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు సరికొత్త రికార్డులను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నిఖిల్ మరిన్ని పాన్ ఇండియా హిట్లను ఖాతాలో వేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. నిఖిల్ (Nikhil) సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే రాబోయే రోజుల్లో నిఖిల్ ఖాతాలో మరిన్ని రికార్డులు చేరడం పక్కా అని చెప్పవచ్చు.

వైరల్ అవుతున్న శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus