నిఖిల్ హీరోగా రీసెంట్‌గా వచ్చిన చిత్రం ‘స్పై’. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్నప్పటికీ.. కలెక్షన్స్ పరంగా మాత్రం హిట్ దిశగానే నడుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నట్లుగా మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ.. చెప్పినట్లుగా పాన్ ఇండియా వైడ్‌గా వారు చెప్పిన భాషలలో ఈ సినిమా విడుదల కాలేదు. దీంతో ఆయన సినీ లవర్స్‌ని క్షమాపణలు కోరారు.
‘‘హలో.. స్పై సినిమాకి నా కెరియర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌కు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాపై మీరంతా ఇంతగా నమ్మకం ఉంచినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే.. కాంట్రాక్ట్ మరియు కంటెంట్ ఆలస్యం అవడంతో.. ఈ సినిమాని దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల చేయలేకపోయాం. ఇది నన్ను ఎంతగానో బాధించింది. ఆ సమస్యతోనే.. ఓవర్సీస్‌లోనూ సుమారు 350 తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. అందుకే హిందీ, కన్నడ, తమిళ మరియు మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తూ.. ఒక ప్రామిస్ కూడా చేస్తున్నాను.
‘కార్తికేయ 2’ సినిమా తర్వాత.. రాబోయే నా మూడు సినిమాలు అన్ని భాషలలోనూ థియేటర్స్‌లో అనుకున్న సమయానికి విడుదల అయ్యేలా చూస్తానని మాటిస్తున్నాను. అలాగే నాపై నమ్మకం ఉంచిన ప్రతి తెలుగు సినీ ప్రేమికుడికి కూడా మాటిస్తున్నాను. ఇకపై నాణ్యత విషయంలో అస్సలు రాజీపడను. దీనికి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా సరే.. తలొగ్గకుండా.. అంతా పూర్తి చేసి, చెక్ చేసి.. మంచి క్వాలిటీ ఉన్న సినిమాను మీకు అందిస్తాను..
హీరో నిఖిల్ (Nikhil) సోషల్ మీడియా వేదికగా అందరినీ క్షమాపణలు కోరారు. ఆయన ఏం తప్పు చేశాడని క్షమాపణలు కోరారని అనుకుంటున్నారేమో.. చెప్పిన టైమ్‌కి, చెప్పిన విధంగా సినిమా అందించలేకపోవడం.. ఆయన దృష్టిలో తప్పే. అందుకే క్షమాపణలు కోరుతూ.. ఇకపై అలాంటి తప్పు జరగనివ్వనని సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ ను విడుదల చేశారు. లాట్స్ ఆప్ లవ్ అండ్ రెస్పెక్ట్‌తో మీ నిఖిల్’’ అంటూ నిఖిల్ తన లేఖలో పేర్కొన్నారు.