Ram Charan Daughter: కూతురిపై చరణ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఏం చెప్పారంటే?
- June 16, 2024 / 05:30 PM ISTByFilmy Focus
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫాదర్స్ డే సందర్భంగా కూతురు క్లీంకారను ఎత్తుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అదే సమయంలో కూతురు క్లీంకార గురించి ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. క్లీంకారకు రోజుకు రెండుసార్లైనా ఆహారం పెడతానని చరణ్ అన్నారు. క్లీంకారకు ఆహారం తినిపించడం నాకు ఇష్టమని చరణ్ పేర్కొన్నారు.
నేను క్లీంకారకు గోరుముద్దలు తినిపిస్తే గిన్నె మొత్తం ఖాళీ కావాల్సిందేనని ఆ విషయంలో నన్నెవరూ బీట్ చేయలేరని చరణ్ కూతురు అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడిప్పుడే క్లీంకార ఫ్యామిలీ మెంబర్స్ ను గుర్తిస్తోందని రామ్ చరణ్ వెల్లడించారు. షూటింగ్స్ కు వెళ్లే సమయంలో కూతురిని ఎంతగానో మిస్ అవుతున్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు. క్లీంకార స్కూల్ లో జాయిన్ అయ్యే వరకు తనతో ఎక్కువ సమయం వెచ్చించేలా సినిమాల షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నానని చరణ్ తెలిపారు.

క్లీంకారతో ఉంటే నాన్న చిరంజీవి సైతం పిల్లాడిలా మారిపోతారని రామ్ చరణ్ పేర్కొన్నారు. నన్ను తాత అని పిలవకు చిరుత అని పిలువు అంటూ చిరంజీవి క్లీంకారతో చెబుతారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్స్, డెడికేషన్, క్రమశిక్షణ విషయంలో నాన్నే నాకు స్పూర్తి అని రామ్ చరణ్ అన్నారు. “రామ్ నువ్వెంత సక్సెస్ అయ్యావనేదాన్ని నేను పట్టించుకోను.. కానీ క్రమశిక్షణను అలవరచుకో” అని నాన్న చెప్పారని చరణ్ వెల్లడించారు.

నాన్న లివింగ్ రోల్ మోడల్ అని నాన్నలా జీవించడం చాలా కష్టమని రామ్ చరణ్ పేర్కొన్నారు. నాన్న ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తారని జిమ్ లో మాతో పోటీ పడతారని నాన్న నాలుగు చిత్రాలకు సంతకాలు చేస్తుంటే నేను ఒకటో రెండో చేస్తున్నానని చరణ్ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

















