Yakshini Review in Telugu: యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
June 14, 2024 / 09:51 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
రాహుల్ విజయ్ (Hero)
వేదిక (Heroine)
మంచు లక్ష్మి, అజయ్ (Cast)
రామ్ వంశీకృష్ణ (Director)
శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని (Producer)
ప్రియదర్శన్ బాల సుబ్రహ్మణ్యం (Music)
జగదీశ్ చీకటి (Cinematography)
Release Date : జూన్ 14, 2024
సోసియో ఫాంటసీ డ్రామాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.ఏ ఐ వంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈ జోనర్లో కంటెంట్ చేయాలని చాలా నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో కూడా ‘అమ్మోరు’ ‘దేవి’ వంటి సినిమాలు వచ్చి సెన్సేషనల్ సక్సెస్ అందుకున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘హనుమాన్’ రిజల్ట్ గురించి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇదే జోనర్లో ‘యక్షిణి’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ వెబ్ సిరీస్.. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఓ తెలుసుకుందాం రండి :
కథ: మహాకాళ్ (అజయ్) నాగలోకానికి చెందినవాడు.అతను యక్ష లోకం పై కన్నేసి.. దానిని లోబరుచుకోవాలని, తద్వారా ఆధిపత్యం చెలాయించాలని,అంతేకాదు యక్షులను తమ బానిసలుగా చేసుకోవాలనే.. తలంపుతో యక్షిణి అయిన మాయ (వేదిక)ను ప్రేమ పేరుతో ఏమారుస్తాడు. ఇదే క్రమంలో రహస్య మందిర ద్వారం గురించి మాయ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటాడు మహాకాళ్. ఈ విషయం కుబేరుడుకి తెలుస్తుంది. దీంతో మాయని అతను శపించి యక్ష లోకానికి దూరమయ్యేలా చేస్తాడు. ఆమె బతిమాలితే దీనికి విమోచన మార్గాన్ని కూడా బోధిస్తాడు.
ఆమె చేసిన పనికి పరిహారంగా భూలోకంలో 100 మంది బ్రహ్మచారులను ప్రేమ పేరుతో మోసం చేసి హతమారిస్తే తప్ప యక్ష లోకానికి తిరిగి రావడం కష్టమని తేల్చి చెబుతాడు. అంతేకాదు 100 వ వ్యక్తి శుద్ధబ్రహ్మణుడు అయ్యి ఉండాలని, అదీ బ్రహ్మచారై ఉండాలని షరతు కూడా పెడతాడు. తర్వాత మాయ 99 మంది బ్రహ్మచారులని తన వశపరుచుకొని హతమారుస్తుంది. వందో వ్యక్తి కోసం చూస్తున్న తరుణంలో కృష్ణ (రాహుల్ విజయ్) ఆమె కంట పడతాడు.
అతని పై కన్నేసిన మాయ.. ఎలా అతన్ని లోబరుచుకుని.. తన కోసం ఆత్మహత్య చేసుకునేలా చేసింది? మరోపక్క కృష్ణ.. మాయని ఎంతవరకు నమ్మాడు.? ఈ క్రమంలో మరో యక్షిణి అయిన జ్వాలాముఖి భూలోకానికి వచ్చి ఏం చేసింది? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: యక్షిణి మాయ పాత్రలో వేదిక లుక్స్ బాగున్నాయి. నిజంగానే యక్ష లోకం నుండి వచ్చిందా అనేంత ఆశ్చర్యపడేలా ఈమె కనిపిస్తుంది. అందాలు వడ్డించడంలోనే కాదు కొన్ని చోట్ల హర్రర్ ఫీల్ కలిగించడంలో కూడా వేదిక సక్సెస్ అయ్యింది అని చెప్పొచ్చు.మహకాళ్‌గా అజయ్… పాత్ర మారిందేమో కానీ నటన సేమ్ అన్నట్టు అనిపిస్తాడు. ఆ పాత్ర తీరు అంతేనేమో. రాహుల్ విజయ్ ఈ సినిమాలో కొత్తగా చేసింది అంటూ ఏమీ లేదు. మరోపక్క ప్రవీణ్, జెమిని సురేష్,జబర్దస్త్ సత్య.. వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: రామ్ వంశీకృష్ణ.. సోసియో ఫాంటసీ జోనర్లో వెబ్ సిరీస్ చేయాలనుకోవడం మంచి ప్రయత్నం. యక్ష లోకం, నాగ లోకం థీమ్ తో చెప్పాలి అనుకోవడం కూడా అతని అభిరుచిని చాటుకుంది. కానీ అనుకున్నది అంతా అతను తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు. యక్ష లోకం.. నాగ లోకంకి ఏం జరిగింది అనేది ఇతను చూపించలేదు. ఇక మిగిలిన కథంతా సైడ్ ట్రాక్ ఎక్కినట్టు అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్, విజువల్స్ కూడా పై పై మెరుపుల్లానే అనిపిస్తాయి. ఎక్కడా క్వాలిటీ కనిపించలేదు.
ఎక్కడ మొదలుపెట్టి… ఎక్కడ ఎండ్ చేయాలి? హుక్ పాయింట్ ఏంటి? అనేది అంచనా వేయకుండా గజిబిజిగా తీసిన సిరీస్ ఇది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటివి కూడా మెప్పించేలా ఏమీ లేవు. ఇలాంటి వెబ్ సిరీస్.. బాహుబలి నిర్మాతలైన ‘ఆర్కా’ వారి నుండి వచ్చింది అంటే జీర్ణించుకోవడం కష్టం.
విశ్లేషణ: ‘యక్షిణి’ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. కానీ రెండో ఎపిసోడ్ కే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ సాగుతుంది. 6 ఎపిసోడ్స్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవు. ఓపిక ఉంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఇంట్లో కూర్చుని ఒకసారి చూడండి.
ఫోకస్ పాయింట్: పై పై మెరుపులే
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus