‘హ్యాపీ డేస్’ చిత్రంతో నటీనటులు గా మారిన వాళ్లలో ఇప్పటికీ రాణిస్తున్నది ఎవరైనా ఉన్నారా అంటే అది నిఖిల్ అనే చెప్పాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘హ్యాపీ డేస్’ లో రాజేష్ అనే పాత్రలో నటించిన నిఖిల్.. ఆ పాత్రకు 100 శాతం న్యాయం చేశాడు అనే చెప్పాలి. అటు తర్వాత వరుస సినిమాల్లో నటించిన నిఖిల్ పెద్ద హిట్లు అందుకోలేకపోయాడు. ‘యువత’ ‘కలవర్ కింగ్’ వంటి చిత్రాలు మాత్రం యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ అన్నట్టు ఆడాయి.
‘స్వామి రారా’ చిత్రం నుండి నిఖిల్ దశ తిరిగింది. అప్పటి నుండి వైవిద్యమైన కథాంశంతో కూడుకున్న చిత్రాలు చేస్తూ సూపర్ హిట్లు అందుకుంటున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ‘కార్తికేయ 2’ చిత్రం అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హిందీలో కూడా ఈ మూవీ అసాధారణమైన కలెక్షన్లు రాబడుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు నిఖిల్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) కార్తికేయ 2: చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన ఈ మూవీ రూ.20 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసి… నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
2) ఎక్కడికి పోతావు చిన్నవాడా : వి ఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ ఫుల్ రన్లో రూ.16 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది.
3) అర్జున్ సురవరం : టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ ఫుల్ రన్లో రూ.9 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది.
4) కేశవ : సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ ఫుల్ రన్లో రూ.7.9 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
5) కిరాక్ పార్టీ : శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ ఫుల్ రన్లో రూ.7.55 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
6) కార్తికేయ : చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ ఫుల్ రన్లో రూ.7.5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
7) స్వామి రారా : సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ ఫుల్ రన్లో రూ.7.1 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.