Rajashekar, Chiranjeevi: రాజశేఖర్ కు చిరు సూపర్ హిట్ రీమేక్ ను కట్టబెట్టిన వేళ..!

మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరో రాజశేఖర్ కు మధ్య భేదాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. చాలా సార్లు ఈ విషయం ప్రూవ్ అయ్యింది. ఈ విషయం పై రాజశేఖర్ బయటపడినా.. చిరు బయటపడలేదు. పైగా రాజశేఖర్ కరోనా టైములో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సైతం చిరు సాయపడ్డారు. తన వంతు నోటి సాయం చేయడానికి చిరు ఎప్పుడూ వెనుకాడరు. రాజశేఖర్ కు మాత్రం ఏమున్నా మనసులో దాచుకోకుండా బయటపడిపోయే మనిషి.

Click Here To Watch NOW

మెగా ఫ్యాన్స్ కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా రాజశేఖర్ ను ఆడేసుకుంటూ ఉంటారు. గతంలో రాజశేఖర్ మరియు అతని కుటుంబం పై మెగా ఫ్యాన్స్ దాడి చేశారు అనే ప్రచారం జరిగింది. దాడి చేసింది చిరు ఫ్యాన్సా లేక ఎవరైనా దీనిని రాజకీయం చేయడానికి చిరుని అడ్డుపెట్టుకున్నారా? ఇది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. గతంలో రాజశేఖర్ కు ఓ సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేసే అవకాశాన్ని చిరు కట్టబెట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మలయాళంలో ‘ఒరు సి.బి.ఐ డైరీ కురిప్పు’ అనే సినిమా తెరకెక్కింది.సంచలన విజయాన్ని నమోదు చేసింది కూడా.దీంతో రాజశేఖర్ తనకి తెలిసిన నిర్మాతలతో ఆ చిత్రం రీమేక్ హక్కులను కొనిపించాలని ప్రయత్నించాడట. కానీ అప్పటికే ‘గీతా ఆర్ట్స్’ అధినేత అల్లు అరవింద్ ఆ చిత్రం రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. ఇంకేముంది ఆయన చిరుతోనే చేస్తారని రాజశేఖర్ నిరాశ చెంది లైట్ తీసుకున్నారు. తర్వాత అనుకోకుండా రాజశేఖర్.. అల్లు అరవింద్ ఓ సినిమా వేడుకలో కలుసుకున్నారు.

ఆ టైములో ‘ఒరు సి.బి.ఐ డైరీ కురిప్పు’ రీమేక్ లో నటిస్తారా అని అడిగారు. అదేంటి మీరు చిరంజీవి గారితో చేయడం లేదా? అంటూ ఆనందంతో అలాగే ఆశ్చర్యంతో అడిగాడు రాజశేఖర్. ఆయనతోనే చేద్దాం అనుకున్నా కానీ డేట్స్ ప్రాబ్లమ్. పైగా ఆయన నీతోనే చేయమన్నారు అంటూ అల్లు అరవింద్ చెప్పారట. ఇంకేముంది రాజశేఖర్ ఎగిరి గంతేసినంత పని చేశారు. ‘న్యాయం కోసం’ అనే పేరుతో ఈ మూవీ తెలుగులోకి రీమేక్ అయ్యింది. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus