Hero Ram: మాస్ మంత్రంతో రామ్ మార్కెట్ పెరుగుతుందా?

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన రామ్ కు మాస్ ప్రేక్షకులతో పోల్చి చూస్తే క్లాస్ ప్రేక్షకుల్లోనే మంచి గుర్తింపు ఉంది. క్లాస్ సినిమాలే రామ్ ఈ స్థాయికి రావడానికి కారణమయ్యాయి. రామ్ గతంలో కొన్ని మాస్ సినిమాలలో నటించినా వరుసగా మాస్ సినిమాలలో నటించలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో రామ్ రూట్ మార్చారని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ కు నెగిటివ్ రివ్యూలు వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా హిట్ గా నిలిచింది.

రెడ్ సినిమాలో కూడా ఒక పాత్రలో ఊరమాస్ లుక్ లో రామ్ నటించారు. ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో ది వారియర్ సినిమాలో రామ్ నటిస్తుండగా ఈ సినిమాలోని హీరో పాత్ర లుక్ క్లాస్ గా కనిపిస్తున్నా పాత్ర మాత్రం మాస్ రోల్ అని తెలుస్తోంది. లింగుస్వామి సినిమాలో మాసీ యాక్టింగ్ తో రామ్ మెప్పించనున్నారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. రామ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా దాదాపుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఊరమాస్ సినిమాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో రామ్ ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా మాస్ సినిమాగానే తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. మాస్ మంత్రాన్ని జపిస్తున్న రామ్ కు తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాల్సి ఉంది. రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు గత కొన్నేళ్లలో రామ్ రెమ్యునరేషన్ సైతం ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం రామ్ ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్న రామ్ ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే రెమ్యునరేషన్ ను మరింత పెంచాలని అనుకుంటున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.