రామ్ (Ram Pothineni) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో ‘రెడీ’ (Ready) అనే సినిమా వచ్చింది. దీనిని ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు అనే చెప్పాలి. జెనీలియా (Genelia) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ పై రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘హ హ హాసిని’ అనే పాటతో సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాడు. పెద్దగా అంచనాలు లేకుండా 2008 వ సంవత్సరం జూన్ 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది.
రామ్ (Ram Pothineni)- జెనీలియా (Genelia) పెయిర్, మేక్ డొనాల్ మూర్తిగా బ్రహ్మానందం (Brahmanandam), మాస్టర్ భరత్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం..ల కామెడీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘రెడీ’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
‘రెడీ’ (Ready) చిత్రం రూ.11.47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.18.79 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.రూ.7.32 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘రెడీ’ (Ready) . 2008 లో ‘జల్సా’ (Jalsa) ‘కృష్ణ’ (Krishna) సినిమాల తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘రెడీ’ నిలిచింది అని చెప్పాలి.