Ravi Teja: రవితేజ కొడుకు, కూతురు ఫోటోలు వైరల్!

మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఒకప్పుడు క్లాప్ బాయ్ గా, లైట్ మెన్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, జూనియర్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసిన రవితేజ … నీకోసం చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి చిత్రాలు .. ఇతన్ని క్రేజీ హీరోగా నిలబెట్టాయి. ఆ తర్వాతి సంగతి తెలిసిందే.

రవితేజ (Ravi Teja) హిట్ కొట్టినా… ఫ్లాప్ కొట్టినా.. వాటి ఫీలింగ్స్ లో ఎక్కువ రోజులు ఉండడు. వెంటనే ఇంకో సినిమా మొదలు పెట్టేస్తాడు. అదీ కాకుండా ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు ఇంకో ఛాన్స్ ఇస్తుంటాడు. ప్రస్తుతం ఈగల్ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న రవితేజ శర్వానంద్ తో కలిసి ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇదిలా ఉండగా.. రవితేజ తన ఫ్యామిలీని మీడియాకి చాలా దూరంగా ఉంచుతాడు. రవితేజ కూడా తన సినిమాల రిలీజ్ టైంలో తప్ప ఎక్కువగా బయట కనపడడు.

అయితే రవితేజ కొడుకు , కూతురి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవితేజ కొడుకు మాహదాన్ అందరికీ తెలుసు. రాజా ది గ్రేట్ చిత్రం ద్వారా ఇతను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక కూతురి పేరు మోక్షద. ఈమె చూడటానికి రవితేజ లానే కనిపిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus