Siddharth: 10 ఏళ్ళల్లో 3 స్క్రిప్టులు మాత్రమే వచ్చాయి.. సిద్ధార్థ్ ఎమోషనల్ కామెంట్స్!

కోలీవుడ్ కి చెందిన నటుడే అయినప్పటికీ సిద్దార్థ్ ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ‘బాయ్స్’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలు.. ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. 2005 , 2006 , 2007 టైంలో.. సిద్దార్థ్ తెలుగులో కూడా స్టార్ హీరోల్లా రాణించాడు. ‘ఆట’ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ‘ఓయ్’ వంటి సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. లాభాలు వచ్చాయి అంటే అతిశయోక్తి అనిపించుకోదు.

అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలతో సమానంగా సిద్దార్థ్ రాణించిన సందర్భాలు ఉన్నాయి. అయితే తర్వాత ఊహించని విధంగా తెలుగు సినిమాలకి దూరమయ్యాడు. 2013లో వచ్చిన ‘బాద్ షా’ తర్వాత సిద్దార్థ్ దాదాపు 8 ఏళ్ళ వరకు టాలీవుడ్లో కనిపించలేదు. 2021 లో అతను రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘మహాసముద్రం’ కూడా పెద్ద ప్లాప్ అయ్యింది.

ఈ ఏడాది వచ్చిన ‘టక్కర్’ కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ వారం అతను ‘చిన్నా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సిద్దార్థ్. ఈ సినిమా ప్రమోషన్లలో సిద్దార్థ్ మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఈ 10 ఏళ్లలో టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎవ్వరూ కూడా తనని పట్టించుకోలేదని..

తన వద్దకి కేవలం 3 స్క్రిప్ట్ లు మాత్రమే వచ్చాయని, అయినా సరే నాతో సినిమా చేయడానికి ఎవరికీ ఇష్టం లేకపోయినా నేనే నిర్మాతగా మారి సినిమా చేసానని, చిన్నా అనే సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని.. ఇది రొటీన్ రొట్ట సినిమా కాదని.. (Siddharth) సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus