Siddharth: ఇక తెలుగులో సినిమాలు చేయనంటూ ఎమోషనల్ అయిన సిద్దార్థ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సిద్దార్థ్ ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు దూరమయ్యారు. తెలుగులో ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఎలాంటి అవకాశాలు రాలేదు అయితే తమిళంలో అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన తన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సిద్ధార్థ నటిస్తూ నిర్మించినటువంటి చిట్టా అనే సినిమా తమిళంలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

కేవలం ఐదు రోజులలోనే ఈ సినిమా 11 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇలా తమిళంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా తెలుగు కన్నడ మలయాళ భాషలలో కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాని తెలుగులో చిన్నా అనే పేరిట విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోని హైదరాబాద్లో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఒక వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దార్థ్ మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

నా సినిమా ఎంతో అద్భుతంగా ఉందని తమిళంలో ఉదయం అయితే ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాని కొనుగోలు చేశారు. కన్నడ మలయాళ భాషలలో కూడా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని కొనుగోలు చేశారు. ఇక ఈ సినిమాని తెలుగులో కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. సిద్ధార్థ సినిమానా ఎవరు చూస్తారు అంటూ ఈ సినిమాని కొనడానికి ఎవరు ముందుకు రాలేదని ఈ సందర్భంగా సిద్ధార్థ ఎమోషనల్ అయ్యారు.

అయితే ఈ సినిమాని విడుదల చేయడానికి ఏషియన్ సునీల్ వాళ్ళు ముందుకు వచ్చారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక మా సినిమాలో ఇది ఉంది అది ఉంది తప్పక చూడండి అంటూ అడుక్కొని బ్యాచ్ నేను కాదు సినిమా చూసిన తర్వాత సినిమా బాగుంది అనిపిస్తేనే తదుపరి సినిమాలను నేను తెలుగులో విడుదల చేస్తానని లేకపోతే ఇంకొకసారి తెలుగులో ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టనని ఈ సందర్భంగా ఈయన (Siddharth) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus