Siddharth: ఫ్రస్ట్రేట్ అయిన హీరో సిద్దార్థ్ … టాలీవుడ్ స్టార్స్ పై సెటైర్లు!

రిలీజ్ కి ముందు ప్రతి సినిమాకి ప్రమోషన్ అనేది బాగా కీలకం. ఈ వారం ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని జనాలకి తెలిసేలా చేసేది ప్రమోషన్ మాత్రమే..! ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఎంత బాగా జరిగితే సినిమాకు అంత ప్లస్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పక్క హీరోల సినిమాల ప్రమోషన్స్ కోసం.. వేరే హీరోలు తరలి వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. దాని వల్ల.. గెస్ట్ గా వచ్చిన హీరోల ఫ్యాన్స్ కూడా..

వాట్సాప్ లో స్టేటస్ లు వంటివి పెట్టి.. ఆ సినిమాని బాగా ప్రమోట్ చేస్తారు. అయితే ప్రతి సినిమా ప్రమోషన్ కి స్టార్ హీరోలు కలిసి వస్తారు అని చెప్పలేం. నిర్మాతలతో ఉన్న ర్యాపోని బట్టి వాళ్ళు రావడం జరుగుతుంది. ఇక విషయానికి వస్తే.. తాజాగా సిద్దార్థ్ హీరోగా రూపొందిన ‘చిన్నా’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఈరోజు జరిగింది. ఈ వేడుకకు గెస్ట్ గా ఎవరూ రాలేదు. ఈ విషయం పై సిద్దార్థ్ కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

‘నేను నిర్మించిన ‘చిన్నా’ సినిమాను ప్రమోట్ చేయడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రమ్మని వేరే హీరోలకి ఫోన్ చేయొచ్చు. కానీ ఏ హీరో కూడా ఫోన్ ఎత్తరు. అందుకే మీ సిద్దూ అయిన నేను. నన్ను స్టార్ గా చేసిన తెలుగు ప్రేక్షకులైన మీరు అక్టోబర్ 6న మా ‘చిన్నా’ సినిమాకి వచ్చి చూసి మీ స్పందన తెలియజేయాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు సిద్దార్థ్.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus