టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో కుటుంబ కథా చిత్రాలను ప్రేమకథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్ ప్రస్తుతం ఇండస్ట్రీలో విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన విలనిజాన్ని చూపెడుతున్నారు. అయితే శ్రీకాంత్ ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి విపరీతమైన ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు. ఇలా హీరోగా మెప్పించిన శ్రీకాంత్ ప్రస్తుతం విలన్ పాత్రలతో ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే తాను ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవుతాయని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చివరికి ఆ సినిమాల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న పరిస్థితులు ఏర్పడ్డాయని శ్రీకాంత్ తెలిపారు. తాను సౌందర్యతో కలిసి నటించిన తారక రాముడు, అనగనగా ఒక అమ్మాయి అనే సినిమాల పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాను అయితే ఈ రెండు సినిమాలు కూడా చేదు అనుభవం మిగిల్చాయి. ఇక ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీకాంత్ సౌందర్యని తలుచుకుని బాధ పడ్డారు.
ఇకపోతే తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ఏ సినిమా అయినా వివాదానికి కారణం అయ్యిందా అనే ప్రశ్న ఎదురవగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను నటించిన ఖడ్గం సినిమా వివాదానికి దారి తీసిందని తెలిపారు.ఈ సినిమాలో తాను ముస్లింలకు వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ చెప్పడం వల్ల తనకు ఏకంగా కొందరి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఇలా చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని అయితే అది కేవలం సినిమా మాత్రమేనని దానిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని తాను చెప్పుకొచ్చానని శ్రీకాంత్ వెల్లడించారు.
ఇకపోతే ఈ సినిమా విడుదలైన అనంతరం తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం వల్ల క్రికెట్ ఆడటానికి వెళ్లే సమయంలో నా రక్షణ కోసం జోబులో గన్ పెట్టుకుని వెళ్లానని ఈ సందర్భంగా ఖడ్గం సినిమా సమయంలో జరిగిన సంఘటన గురించి శ్రీకాంత్ వెల్లడించారు. ఈ సినిమా మినహా తాను ఎలాంటి కాంట్రవర్సి సినిమాలు చేయలేదని, తనకు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని తెలిపారు.