ఇండియన్ ఆర్మీకి సుమన్ 117 ఎకరాల భూమిని విరాళంగా ఈరోజంతా తెగ వార్తలు వచ్చాయి. దాంతో సుమన్ ను అంతా రియల్ హీరో అంటూ కొనియాడారు. ఈరోజంతా సుమన్ ను ఆకాశానికి ఎత్తేసారు నెటిజన్లు. కేటీఆర్ నేతృత్వంలో సుమన్ విరాళం అందజేసినట్టు చాలా డిస్కషన్లు నడిచాయి.అయితే తాజాగా ఈ వార్తల పై సుమన్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ “సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మొద్దు.
ఆ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో ఇప్పటికీ నడుస్తుంది.ఆ వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే… వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను. అప్పటి వరకు ఇలాంటి వార్తల్ని సృష్టించకండి” అంటూ సుమన్ విన్నపించుకున్నారు. కార్గిల్ వార్ టైంలోనే అంటే 28 ఏళ్ళ క్రితమే సుమన్ ఇండియన్ ఆర్మీకి ఈ భూమిని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అప్పట్లో దీని కోసం ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు.
కానీ ఈ 117 ఎకరాల భూమి లిటికేషన్ లో పడిందట. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తూనే ఉంది. ఈరోజు వచ్చిన వార్తలతో సుమన్ కు అనుకూలంగా తీర్పు వచ్చిందేమో… అని అంతా అనుకున్నారు. కానీ అందులో నిజం లేదని సుమన్ తెలపడం జరిగింది.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!