సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఇమేజ్ బాగా పెరిగిన తర్వాతో.. సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకునే ముందో రాజకీయాల వైపు చూస్తుంటారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో ఇలాంటి సంస్కృతి చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైంది. తెలుగులో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక తమిళంలో రజినీకాంత్, విజయ్ లాంటి హీరోల ఎంట్రీ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో స్టార్ హీరో సూర్య కూడా రాజకీయాలు ప్రవేశమ చేసే అవకాశం ఉందని తమిళనాట చెప్పుకుంటున్నారు.
దీనిపై కోలీవుడ్ మీడియా పలు వార్తలను ప్రచురించింది. సూర్య కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఆయన ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు. తమిళనాట ఎలాంటి విపత్తులు సంభవించినా ముందుకొచ్చి తనవంతు సాయం చేస్తుంటారు. ఇప్పుడు తమిళనాట రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ క్రమంలో సూర్యకి రాజకీయాలకు సంబంధించి పలు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదా..? అంటూ ఇటీవల సూర్యని ప్రశ్నించగా..
ఆయన తడబాటు లేకుండా సమాధానమిచ్చాడు. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని.. తన మనసుకి నచ్చిందే చేస్తానని.. తను చేసే సామాజిక కార్యక్రమాలు కేవలం సేవాదృక్పథంతో చేస్తున్నానే తప్ప.. వాటికి రాజకీయాలు అంటగట్టకండి అంటూ కోరారు.